Shukra Gochar 2023: హిందూ పంచాంగం ప్రకారం ధన సంపదలు, సుఖ శాంతులకు కారకుడిగా భావించే శుక్రుడు వృషభరాశిలో ప్రవేశించాడు. శుక్ర గోచారం ప్రభావం అన్నిరాశులపై పడినా..5 రాశులకు మాత్రం అదృష్టం వరించనుంది. జీవితంలో ఎన్నడూ చూడని ధనలాభం కలగనుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

శుక్రుడి రాశి పరివర్తనం ప్రభావంతో ఆ 5 రాశులకు నెలరోజులు వెనక్కి తిరిగి చూసుకోవల్సిన అవసరం లేదు. ఊహించని ధనలాభం కలుగుతుంది. సుఖసంతోషాలు కలగనున్నాయి. శుక్ర గ్రహాన్ని జ్యోతిష్య పండితుల ప్రకారం ప్రేమ, సౌందర్యం, ఆకర్షణకు ప్రతీకగా భావిస్తారు. జీవితంలో భౌతికమైన సుఖాలను ఇచ్చేది శుక్రుడే. శుక్రుడు ఎవరి కుండలిలో బలమైన స్థితిలో ఉంటాడో..వారి జీవితింలో గౌరవ మర్యాదలు, శారీరక, మానసిక సుఖం, ప్రశాంతత లభిస్తాయి. శుక్రుడి నెగెటివ్ ప్రభావంతో కొన్ని రాశులవారికి ధనహాని కలుగుతుంది. చట్ట సంబంధ విషయాల్లో సమస్యలు ఎదుర్కోవల్సి వస్తుంది. శుక్ర గ్రహం ఏప్రిల్ 6, 2023 న వృషభ రాశిలో ప్రవేశించి ఓ నెలరోజులు ఇదే రాశిలో ఉండటం వల్ల 5 రాశులకు అదృష్టం తోడుగా ఉంటుంది. ఊహించని లాభాలు కలుగుతాయి. ధన సంపదలతో తులతూగుతారు. 


కన్యా రాశి:


కన్యా రాశి జాతకులకు శుక్రుడి గోచారం ప్రభావంతో విశేషమైన లాభం కలగనుంది. మీకు అదృష్టం తోడుగా ఉండటమే కాకుండా తండ్రి సహకారం పూర్తిగా లభిస్తుంది. దాంతోపాటు మీరు ఊహించని స్థాయిలో ధనలాభం కలుగుతుంది. విదేశీయాత్రలకు వెళ్లే అవకాశాలున్నాయి. కెరీర్ విషయంలో చాలా బాగుంటుంది. పెళ్లి చేసుకోవాలనుకునేవారికి అనుకూలమైన సమయం. జీవిత భాగస్వామితో మంచి సంబంధాలుంటాయి. ఆర్ధికంగా ఏ విధమైన ఇబ్బందులుండవు. ఆరోగ్యం బాగుంటుంది. 


Also Read: Angaraka Yogam : అంగారక యోగం అంటే ఏమిటి? మీ జాతకంలో ఇది ఏర్పడితే ఏం జరుగుతుందో తెలుసా?


కర్కాటక రాశి:


శుక్రుడి వృషభ రాశి ప్రవేశం కారణంగా కర్కాటక రాశి జాతకులకు చాలా లాభం కలగనుంది. ఎప్పట్నించో ఉన్న కోర్కెలు చాలావరకూ నెరవేరుతాయి. కొత్త ఇంటి కోరిక నెరవేరుతుంది. మీ కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. వ్యాపారం చేసేవారికి మంచి రోజులని చెప్పాలి. వ్యాపారం విస్తృతమై మంచి లాభాలు ఆర్జిస్తారు.  ఇంట్లో శుభకార్యం జరగవచ్చు. ఆరోగ్యం బాగుంటుంది. దీర్ఘ కాలిక రోగాల నుంచి ఉపశమనం లభిస్తుంది. 


వృషభ రాశి:


ఈ రాశి జాతకులకు చట్ట సంబంధ విషయాల్లో అనుకూల పరిణామాలు ఎదురౌతాయి. ప్రేమ సంబంధ విషయాల్లో బాగుంటుంది. పెళ్లికి మాత్రం ఆలస్యం కావచ్చు ఆర్ధికంగా ఏ విధమైన ఇబ్బందులుండవు. డబ్బులు సంపాదించడంలో సఫలీకృతమౌతారు. ఖర్చులు మాత్రం పెరుగుతాయి.


మకర రాశి:


శుక్రుడి వృషభ రాశిలో ప్రవేశించడం వల్ల మకర రాశి జాతకులకు అనుకూల పరిణామాలుంటాయి. ప్రతి రంగంలో సంతృప్తి కలుగుతుంది. ఆర్ధికంగా పటిష్ట స్థితిలో ఉంటారు. కెరీర్ విషయానికొస్తే ఉన్నత పదవికి చేరుకుంటారు. వ్యాపారులకు చాలా మంచి సమయం. కొత్త వ్యాపారం ప్రారంభించాలన్నా లేదా ఎందులోనైనా పెట్టుబడులు పెట్టాలన్నా అనుకూలమైన సమయమిది. ట్రేడింగ్ వ్యవహారాల్లో బాగుంటుంది. ఆరోగ్యం అన్ని విధాలుగా మెరుగుపడుతుంది.


సింహ రాశి:


శుక్రుడి గోచారం ప్రభావంతో సింహ రాశి జాతకులకు అత్యంత శుభదాయకంగా చెప్పవచ్చు. కెరీర్‌లో సంతృప్తి లభిస్తుంది. పనిచేసే చోట ప్రశంసలుంటాయి. వ్యాపారులకు మంచి సమయం. ఊహించని లాభాలు ఆర్జిస్తారు. ఒకటి కంటే ఎక్కువ వ్యాపారాలుంటాయి. పదోన్నతితో పాటు ఇంక్రిమెంట్లు లభిస్తాయి. ఉద్యోగంలో కొత్త అవకాశాలుంటాయి. ఆరోగ్యం విషయంలో ఏ విధమైన ఇబ్బంది ఉండదు. 


Also Read: Mesh Sankranti 2023: మేష సంక్రాంతి రోజున మీ రాశి ప్రకారం ఇలా దానం చేస్తే.. మీకు డబ్బే డబ్బు..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook