Venus Transit 2023: హిందూమత విశ్వాసాల ప్రకారం శుక్రుడిని వైభవం, విలాసానికి కారకుడిగా భావిస్తారు. శక్ర గ్రహం ఇవాళ తులా రాశిలో ప్రవేశించనుండటంతో కొన్ని రాశులపై ప్రతికూల ప్రభావం పడుతోంది. మరి కొన్ని రాశులకు అద్భుతమైన లాభాలు కలగనున్నాయి. మూడు రాశులకు ప్రత్యేకించి చాలా ప్రయోజనం కలగనుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

హిందూమతం ప్రకారం శుక్రగ్రహానికి చాలా మహత్యం ఉంది. శుక్రుడిని ధన సంపదలు, అష్ట ఐశ్వర్యాలు, వైభవం, సుఖ సంతోషాలు, విలాస జీవితానికి ప్రతీకగా భావిస్తారు. శుక్రుడి ఎప్పుడు రాశి పరివర్తనం చెందినా సంబంధిత రాశుల జీవితాల ఆర్ధిక పరిస్థితిపై ప్రభావం పడుతుంటుంది. ఇవాళ అంటే నవంబర్ 30న శుక్రుడి గోచారముంది. తులా రాశిలో ప్రవేశించనున్నాడు. ఈ ప్రభావం వాస్తవానికి మొత్తం 12 రాశులపై కన్పించనుంది. శుక్ర గ్రహం ఏ రాశికి అధిపతో అదే రాశిలో ప్రవేశించనున్నాడు. అందుకే ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కొన్ని రాశులవారికైతే మహర్దశ పట్టనుంది. 


మకర రాశి జాతకులకు శుక్ర గ్రహం గోచారం వల్ల ఉద్యోగ, వ్యాపార వర్గాలకు అత్యధిక ప్రయోజనం కలగనుంది. విదేశాలతో వ్యాపారం చేసేవారికి చాలా అనువైన సమయంగా భావించాలి. కొత్త ఉద్యోగ అవకాశాలు లేదా పదోన్నతులు లభిస్తాయి. వ్యాపారంలో ఊహించని లాభాలు కలగనున్నాయి. కెరీర్‌పరంగా మంచి ఎదుగుదల ఉంటుంది. ఆరోగ్యం విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. చేపట్టిన పనులు పెండింగులో పడకుండా సకాలంలో పూర్తవుతాయి. ఆర్ధికంగా మంచి స్థితిలో ఉంటారు. 


మేష రాశి జాతకులకు శుక్రుడి తులా రాశి ప్రవేశం కారణంగా ఊహించని లాభాలు కలుగుతాయి. వ్యాపారులకు ముఖ్యంగా భాగస్వామ్య వ్యాపారం చేసేవారికి చాలా లాభదాయకంగా ఉంటుంది. ఆకస్మిక ధనలాభం కలగడమే కాకుండా కొత్త ఆదాయ మార్గాలు తెర్చుకుంటాయి. ఈ రాశివారిలో ఇంట్లో పెద్దల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. జీవిత భాగస్వామితో అనువైన సమయం గడపగలరు. కెరీర్, వ్యాపారం, ఉద్యోగ రంగాల్లో ఉండేవారికి చాలా ప్రయోజనం. ఉద్యోగులకు పదోన్నతులు లభిస్తాయి. 


కర్కాటక రాశి జాతకులకు శుక్రుడి గోచారం ప్రభావం లాభదాయకంగా ఉంటుంది. పూర్వీకుల సంపద లభించడంతో ఆర్ధికంగా ఇబ్బందులుండవు. వ్యాపారంలో అమితమైన లాభాలు ఆర్జిస్తారు. రియల్ ఎస్టేట్, ప్రాపర్టీ సంబంధిత వ్యాపారాలు చేసేవారికి అనువైన సమయం. కొత్త ఇళ్లు లేదా వాహనం కొనుగోలు చేయవచ్చు. జీవితంలో సుఖ సంతోషాలు ప్రాప్తిస్తాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఇంట్లో పెద్దవాళ్ల ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాలి. చాలావరకూ ఆరోగ్య సమస్యలు తీరిపోయినా కొన్ని బాధించకుండా జాగ్రత్త పడాలి. 


Also read: Vastu Tips: ఇంట్లో పేదరికం పోవాలంటే ఈ వాస్తు సూచనలు పాటించాల్సిందే



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook