Vastu Tips: ఇంట్లో పేదరికం పోవాలంటే ఈ వాస్తు సూచనలు పాటించాల్సిందే

Vastu Tips: హిందూమతంలో జ్యోతిష్య శాస్త్రానికి ఎంతటి ప్రాముఖ్యత, మహత్యం ఉన్నాయో వాస్తుకు కూడా అంతే ప్రాధాన్యత ఉంది. వాస్తు సూచనలు పాటించడం వల్ల జీవితంలో చాలా వరకూ సాధించవచ్చంటున్నారు జ్యోతిష్య పండితులు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Nov 29, 2023, 10:24 AM IST
Vastu Tips: ఇంట్లో పేదరికం పోవాలంటే ఈ వాస్తు సూచనలు పాటించాల్సిందే

Vastu Tips: వాస్తు శాస్త్రానికి హిందూమతంలో విశేష ప్రాధాన్యత ఉంది. ఇంటి నిర్మాణం, ఇంట్లో ఏ వస్తువు ఎక్కడుండాలి. ఏ మొక్కలు ఏ దిశలో అమర్చుకోవాలనే వివరాలు పూర్తిగా ఉన్నాయి. అంటే ఇంటికి, ఆఫీసుకు, వ్యాపారానికి సంబంధించి ప్రతి చిన్న అంశం గురించి వాస్తులో వివరణ ఉంది. 

వాస్తు ఇంటికి లేదా ఆఫీసు, వ్యాపార స్థలానికి ఎంత అవసరమో వాస్తు దోషం అంత ప్రమాదకరం. అందుకే చాలామంది ఏ చిన్న పని ప్రారంభించినా వాస్తు చూస్తుంటారు. హిందూమతంలో వాస్తుకు అంత మహత్యం కూడా ఉంది. వాస్తుదోషముంటే అన్నిరకాలుగా నష్టం చేకూరుతుందంటారు. ఆర్ధికంగా ఇబ్బందులకు గురిచేస్తుంది. కెరీర్‌లో ఆటంకం కలగవచ్చు. వాస్తు ప్రకారం కొన్ని తప్పులు లేదా పొరపాట్లు చేయకూడదంటారు. ఎందుకంటే వాస్తులో లోపముంటే కెరీర్, ఆర్ధిక పరిస్థితి, ఆరోగ్యంపై  ప్రతికూల ప్రభావం పడుతుంది. అందుకే కొన్ని వస్తువులు వాస్తు ప్రకారం ఉంటే విజయం తప్పకుండా లభిస్తుందంటారు. వాస్తు సరిగ్గా ఉంటే ఇంట్లో ధన సంపదలు పెరుగుతాయని నమ్మకం. ఆరోగ్యం మెరుగుపడుతుంది. కెరీర్‌లో రాణించేందుకు కొత్త మార్గాలు తెర్చుకుంటాయి. వాస్తు దోషముంటే మాత్రం కెరీర్‌కు అన్నీ ఆటంకాలే ఎదురౌతాయి. ఆర్ధికంగా నష్టాలు ఎదురుకావచ్చు. అనవసర ఖర్చులు పెరిగిపోతాయి. ఇంట్లో గానీ జేబులో గానీ డబ్బు అసలు నిలవదు. అందుకే వాస్తు సూచనలు తప్పకుండా పాటించాలంటారు. 

వాస్తుశాస్త్రం ప్రకారం ప్రతి ఇంట్లో కొన్ని వస్తువుల్ని ఖాళీగా ఎన్నడూ ఉంచకూడదు. ఈ వస్తువులు పొరపాటున ఖాళీగా ఉన్నాయంటే ఆ వ్యక్తి జేబు ఖాళీ అయిపోతుందని అర్ధం. ముఖ్యంగా ఇంట్లో కిచెన్‌లో పిండి, బియ్యం ఎప్పుడూ పూర్తిగా అడుగంటకూడదు. ధాన్యపు డబ్బాలు ఖాళీగా ఉంటే అన్నపూర్ణ కోపానికి కారణమౌతారని విశ్వాసం. అన్నపూర్ణ అంటే లక్ష్మీదేవి ప్రతిరూపమే. లక్ష్మీదేవి ఆగ్రహం అంటే పేదరికం కొనితెచ్చుకోవడమే. అదే సమయంలో సమాజంలో గౌరవ మర్యాదలు కోల్పోతారు. అందుకే ఇంట్లో పిండి, బియ్యం వంటివి పూర్తిగా అడుగంటకముందే తిరిగి తెచ్చుకోవల్సి ఉంటుంది. 

వాస్తు ప్రకారం ఇంట్లోని పూజాగదిలో ఉంచే జలపత్రం, కిచెన్‌లో మంచి నీళ్ల పాత్ర ఎప్పుడూ ఖాళీగా ఉండకూడదు. ఇలా ఉండటం వల్ల  ఇంట్లో దారిద్ర్యం తాండవిస్తుందంటారు. మంచి నీటి గిన్నె ఖాళీగా ఉండటం అనేది పేదరికం, అవమానానికి కారణం కావచ్చు. అయితే ఎప్పటికప్పుడు క్లీన్ చేసి డ్రై చేసి నీళ్లు నింపే ముందు వేరే పాత్రలో ఆ నీళ్లు కొద్దిగానైనా ఉంచాల్సి ఉంటుంది. ఈ తరహా జాగ్రత్తలు తీసుకోవాలి.

మరోవైపు ఏ వ్యక్తి అయినా సరే తన పర్సు, ఖజానా పెట్టెను పూర్తిగా ఖాలీగా ఉంచకూడదు. ఇది అశుభ సూచకమని అంటారు. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి ఆగ్రహం కలుగుతుంది. అందుకే కనీసం కొద్దిమొత్తం డబ్బులైనా ఉంచే విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి. దీనివల్ల ఆ ఇంట్లో లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి డబ్బు ఆదా అవుతుంది.

Also read: Saturn Transit: శని నక్షత్ర గోచారంతో ఈ మూడు రాశులకు గోల్డెన్ డేస్, ఎప్పట్నించంటే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News