శుక్ర గ్రహాన్ని ప్రేమ-రొమాన్స్, సౌందర్యం, ధనం, లగ్జరీలకు కారకుడిగా పిలుస్తారు. జ్యోతిష్యం ప్రకారం కుండలిలో ఒకవేళ శుక్రుడు మంచి స్థితిలో ఉంటే..ఆ జాతకుల జీవితంలో డబ్బు సమస్య ఎన్నటి రానేరాదు. పూర్తి వివరాలు మీ కోసం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ఫిబ్రవరి 15వ తేదీన శుక్రుడు మీనరాశిలో ప్రవేశించనున్నాడు. శుక్రుడి గోచారం అన్ని రాశుల జీవితాలపై స్పష్టంగా ఉంటుంది. కొన్ని రాశులకు శుక్రుడి రాశి పరివర్తనం అత్యంత లాభదాయకంగా ఉండనుంది. తమ భాగస్వామితో సంపూర్ణ ప్రేమను పొందుతారు. జీవితంలో ఎప్పటికీ ఆర్ధిక ఇబ్బందులు ఎదురుకావు. 


మేషరాశి


మేషరాశి జాతకులకు శుక్రుడి గోచారం అత్యంత శుభ సూచకం. పెద్దఎత్తున ధనం ఖర్చు చేసి లగ్జరీ పొందుతారు. సుఖ సౌకర్యాల కల్పనలో ఎక్కువ డబ్బులు ఖర్చు పెడతారు. అయితే ఆర్ధికంగా లాభాలుంటాయి. ప్రైవేట్‌రంగంలో పనిచేసే వ్యక్తులకు పదోన్నతి లభించవచ్చు. జీతంలో పెరుగుదల ఉంటుంది. వ్యాపారం చేసేవారికి లాభదాయకం. కొంతమందికి విదేశాలకు వెళ్లడం ద్వారా లాభాలు ఆర్జిస్తారు. 


వృషభ రాశి


వృషభ రాశి జాతకులకు శుక్రుడి గోచారం శుభఫలాలనిస్తుంది. మానసిక సంతృప్తి కలుగుతుంది. కోర్కెలు నెరవేరుతాయి. మంచి అవకాశాలు లభిస్తాయి. కొత్త ఉద్యోగ ఆఫర్లు రావచ్చు. ఏదైనా కొత్త ప్రాజెక్టులో భాగస్వామ్యం కావచ్చు. కొత్త వ్యాపారం చేసేవారికి లాభాలు కలుగుతాయి.


మిథునరాశి


శుక్రుడి రాశి పరివర్తనం మిథున రాశి జాతకులకు ప్రేమను, డబ్బుల్ని అందిస్తుంది. ఒకవేళ నలుగురితో బాగుంటే..ఇంకా ఎక్కువ లాభాలు కలుగుతాయి. 


కర్కాటక రాశి


కర్కాటక రాశి జాతకులకు శుక్రుడి గోచారం చాలా సమస్యల్నించి ఉపశమనం కల్గిస్తుంది. ప్రత్యేకించి ఉద్యోగం చేసేవారికి ఎన్నాళ్ల నుంచో ఎదురుచూస్తున్న పదోన్నతి, మంచి జీతం లభిస్తుంది. ఏదైనా అవార్డు దక్కవచ్చు. వ్యాపారం చేసేవారికి ఆర్ధిక లాభాలుంటాయి. దూర ప్రయాణాలు చేయవచ్చు.


Also read: Surya Guru Yuti 2023: 12 ఏళ్ల తరువాత ఈ రాశులకు కనకవర్షం, కొన్ని రాశులకు తీవ్ర ఇబ్బందులు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook