Venus Transit 2023: కర్కాటక రాశిలో శుక్రుడి కదలికలు..ఈ రాశులవారికి తీవ్ర నష్టాలు, కష్టాలు!
Venus Transit 2023: శుక్రుడి కదలికల కారణంగా కొన్ని రాశులవారికి తీవ్ర నష్టాలు వస్తాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ రెండు అంశాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది.
Shukra Uday 2023: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం..శుక్ర గ్రహాన్ని సంపద, శ్రేయస్సు, ఆనందం, ప్రేమకు సూచికగా భావిస్తారు. జాతకంలో శుక్రుడు బలమైన స్థానంలో ఉంటే చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా ఎలాంటి పనులు చేసిన సులభంగా విజయాలు సాధిస్తారు. అయితే ఆగష్టు 8 శుక్రుడు కర్కాటకంలోకి తిరోగమనం చేసింది. దీని కారణంగా కొన్ని రాశులవారి జాతకాల్లో శుక్రుడు బలహీనంగా మారబోతున్నాడు. ఈ ప్రభావంతో ఆర్థికంగా, సమాజికంగా తీవ్ర నష్టాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా అనారోగ్య సమస్యల బారిన పడే అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే శుక్రుడు ఆగస్టు 18న తిరోగమన దశలో కదలబోతున్నాడు. దీని కారణంగా కొన్ని రాశులవారిపై రెట్టింపు ప్రభావం పడుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ ప్రభావం కారణంగా ఏయే రాశులవారు తీవ్ర దుష్ప్రబావాలను అనుభవిస్తారో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ఈ రాశులవారికి తీవ్ర నష్టాలు తప్పవు:
మేషరాశి:
కర్కాటక రాశిలో శుక్రుడు తిరోగమన దశలో తిరగడం కారణంగా ప్రేమ జీవితంలో చాలా రకాల మార్పులు వస్తాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ సమయంలో వీరు భావోద్వేగానికి గురవుతారు. అంతేకాకుండా చిన్న చిన్న విషయాలే మిమ్మల్ని తీవ్ర ఇబ్బందులు పెట్టే అవకాశాలు ఉన్నాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా కుటుంబంలో కూడా తీవ్ర సమస్యలు వచ్చే ఛాన్స్‌లు ఉన్నాయి. అయితే ఈ క్రమంలో ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే తీవ్ర అనారోగ్య సమస్యలు రావచ్చని నిపుణులు చెబుతున్నారు.
ఇది కూడా చదవండి : Ways to Increase Hemoglobin: హిమోగ్లోబిన్ లేకపోతే ఎన్ని రకాల సమస్యలో తెలుసా ?
మిథున రాశి:
శుక్రుడి కదలికల కారణంగా మిథున రాశివారికి కొంత అనుకూలంగా మరికొంద ప్రతికూలంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఈ సమయంలో ఖర్చులు పెరిగి ఆదాయం కూడా తగ్గే అవకాశాలు ఉన్నాయి. కుటుంబ బాధ్యతల వల్ల మీ ఖర్చులు రెట్టింపు అవుతాయి. అంతేకాకుండా బెట్టింగ్ అలవాటు ఉన్నవారు మానుకోవడం చాలా మంచిది. లేకపోతే తీవ్రంగా నష్టపోయే అవకాశాలు కూడా ఉన్నాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలో మిథున రాశివారు కూడా ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది.
తుల రాశి:
శుక్రుడి కదలికల కారణంగా తుల రాశివారికి తీవ్ర దుష్ప్రభావాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ క్రమంలో ఉద్యోగాలు చేసేవారికి అనేక రకాల సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా పనుల్లో మార్పులు రావడం కారణంగా..ఒత్తిడి వంటి సమస్యల బారిన పడే అవకాశాలు ఉన్నాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. వ్యాపారాల్లో కూడా తీవ్ర నష్టాలు రావచ్చని నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ క్రమంలో పెట్టుబడులు పెట్టేవారు మానుకోవాల్సి ఉంటుంది. లేకపోతే నష్టపోయే అవకాశాలు ఉన్నాయి.
ఇది కూడా చదవండి : Ways to Increase Hemoglobin: హిమోగ్లోబిన్ లేకపోతే ఎన్ని రకాల సమస్యలో తెలుసా ?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి