Venus Transit 2023: గ్రహాల గోచారం లేదా రాశి పరివర్తనం ప్రభావం అన్ని రాశులపై పడుతుంటుంది. శుక్రుడు కర్కాటక రాశి ప్రవేశం ఎలాంటి ప్రభావం కల్గిస్తుంది, ముఖ్యంగా ఆ నాలుగు రాశులపై ఎలా ఉంటుందనే వవరాలు పరిశీలిద్దాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ధనం, వైభవం, ఐశ్వర్యానికి కారణంగా హిందూవులు భావించే శుక్రుడు త్వరలో మంగళ గ్రహం రాశి నుంచి బయటికొచ్చి చంద్రుడు రాశి కర్కాటకంలో ప్రవేశించనున్నాడు. ఓ నెలరోజుల పాటు ఇదే రాశిలో శుక్రుడి సంచారం కారణంగా 4 రాశులపై ఊహించని ధన సంపదలు వర్షించనున్నాయి. హిందూ మత విశ్వాసాల ప్రకారం శుక్రుడు నిర్ణీత సమయంలో రాశి పరివర్తనం చెందుతుంటాడు. మే 30 తేదీన మిధున రాశి నుంచి కర్కాటక రాశిలో ప్రవేశించనుండటం 4 రాశులకు అత్యద్భుతంగా మారనుంది. ఫలితంగా  ఈ నాలుగు రాశులకు ఓ నెలరోజుల వరకూ ఉద్యోగ, వ్యాపారాల్లో ఊహించని లాభాలు కలగనున్నాయి. 


వృశ్చిక రాశి


శుక్రగ్రహం రాశి పరివర్తనం ప్రభావంతో వృశ్చిక రాశి జీవితాల్లో ఊహించని మార్పులు కన్పించనున్నాయి. విద్యార్ధులకు , గురువర్యులకు మంచి అనుకూలమైన సమయం. ఆధ్యాత్మిక యాత్రలకు వెళ్లే అవకాశాలున్నాయి. కొత్త వ్యక్తులతో పరిచయం ఏర్పడనుంది. విద్యార్ధులు ఉన్నత చదువులు చదివే అవకాశాలు కలుగుతాయి. ఆరోగ్యం బాగుంటుంది.


మేష రాశి


శుక్రుడి గోచారం కారణంగా మేష రాశి జాతకులకు పదోన్నతి, ఇంక్రిమెంట్లు లభిస్తాయి. ప్రతి పనిలో విజయం చేకూరుతుంది. కుటుంబసభ్యులతో ఆనందంగా గడపడమే కాకుండా కీలకమైన అంశాల్లో వారి తోడ్పాటు లభిస్తుంది. ఇంట్లో సుఖ శాంతులుంటాయి. అభినయం, నాటకం, నృత్యం వంటివి నేర్చుకునే అవకాశాలుంటాయి. జీవిత భాగస్వామికి అపారమైన ధనలాభం కలగనుంది. ఆర్ధికంగా పటిష్టమౌతారు. 


మీన రాశి


శుక్రుడి రాశి పరివర్తనం ప్రభావం మీన రాశి జాతకంపై అద్భుతంగా ఉండనుంది. కొత్త వాహనాలు కొనుగోలు చేయవచ్చు. మీ మనస్సులో కలిగే కొత్త ఆలోచనలు సాకారమౌతాయి. ఆదాయానికి కొత్త మార్గాలు తెర్చుకుంటాయి. ఆర్ధికంగా పటిష్టమైన స్థితిలో ఉంటారు. అనారోగ్య సమస్యలు పెద్దగా ఉండవనే చెప్పాలి. ఉద్యోగమార్పుకు ఆలోచిస్తుంటే ఇదే మంచి సమయం. వ్యాపారస్థులు భారీగా లాభాలు ఆర్జిస్తారు.


కర్కాటక రాశి


శుక్రుడి రాశి మారడం కర్కాటక రాశి జాతకులపై కచ్చితంగా పడుతుంది. ఈ రాశివారికి మే 30 నుంచి అంతా అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగంలో మంచి స్థితికి చేరుకోవడమే కాకుండా ఉన్నతాధికారులతో సంబంధాలు మెరుగుపర్చుకుంటారు. ప్రజల్ని మీ వైపుకు ఆకర్షించగలుగుతారు.  ఆర్ధికంగా ఏ విధమైన సమస్యలుండవు. ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. వ్యాపారులకు మంచి వృద్ధి కన్పిస్తుంది. లాభాలు ఆర్జిస్తారు. 


Also read: Jupiter Mahadasha: 16 ఏళ్లపాటు ఉండే గురు మహాదశ.. ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలుసా?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook