Jupiter Mahadasha: 16 ఏళ్లపాటు ఉండే గురు మహాదశ.. ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలుసా?

Jupiter Mahadasha effect: ఆస్ట్రాలజీలో బృహస్పతిని దేవగురు పిలుస్తారు. సాధారణంగా గురు మహాదశ 16 సంవత్సరాలు ఉంటుంది. దీని ప్రభావం గురించి తెలుసుకుందాం.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : May 8, 2023, 07:28 PM IST
Jupiter Mahadasha: 16 ఏళ్లపాటు ఉండే గురు మహాదశ.. ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలుసా?

Guru Mahadasha is Good or Bad: మీ జాతకంలోని గ్రహాల స్థానాలను బట్టి జ్యోతిష్యులు మన ప్యూచర్ ను చెబుతారు. ప్రతి గ్రహానికి మహాదశ మరియు అంతర్దశ రెండూ ఉంటాయి. ఆస్ట్రాలజీలో బృహస్పతిని శుభగ్రహంగా భావిస్తారు. ఇతడిని అదృష్టం, సంపద మరియు సంతానానికి కారకుడిగా భావిస్తారు. సాధారణంగా గురు మహాదశ 16 సంవత్సరాలు ఉంటుంది. 

శుభ స్థితి
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ఎవరి జాతకంలో గురుడు శుభస్థానంలో ఉంటాడో వారికి దేనికీ లోటు ఉండదు. బృహస్పతి అనుగ్రహం ఉన్న వ్యక్తులు చాలా అందంగా, ప్రశాంతంగా మరియు జ్ఞానాన్ని కలిగి ఉంటాడు. మీరు కెరీర్ లో చాలా ప్రయోజనాలు పొందుతారు. జీవితంలో ఎప్పుడూ డబ్బుకు లోటు ఉండదు. 

చెడు స్థితి
జాతకంలో బృహస్పతి అశుభ స్థానంలో ఉన్న వ్యక్తులు జీవితంలో చాలా కష్టాలను ఎదుర్కోవలసి ఉంటుంది. వైవాహిక జీవితంలో విభేదాలు తలెత్తుతాయి. మీరు కెరీర్‌లో చాలా అడ్డంకులను ఎదుర్కోంటారు. సంతానం కోసం కొంత కాలం వేచిచూడాల్సి ఉంటుంది. మీ ఆరోగ్యం క్షీణించే అవకాశం ఉంది.  

ప్రభావం
ఎప్పుడైతే బృహస్పతి యొక్క మహాదశ కొనసాగుతుందో.. వారి జీవితంలో అనేక మార్పులు చోటుచేసుకుంటాయి. మీరు చాలా డబ్బును పొందుతారు. మీరు ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవల్సి ఉంటుంది. ప్రతికూల ఆలోచనల నుండి విముక్తి లభిస్తుంది. మీరు పేరు ప్రఖ్యాతులు సాధిస్తారు.

పరిహారం
జాతకంలో దేవగురువు బృహస్పతి బలహీన లేదా అశుభ స్థితిలో ఉన్న వ్యక్తులు గురువారం ఉపవాసం ఉండాలి. ఈరోజున పసుపు మిఠాయిలు లేదా శనగపిండి మరియు పసుపుతో చేసిన ఏదైనా వస్తువును సేవించడం శ్రేయస్కరం. పసుపు నీటితో స్నానం చేసి విష్ణుమూర్తిని పూజించడం వల్ల మేలు జరుగుతుంది. గురువారం అరటి చెట్టుకు పూజ చేసి పసుపు, బెల్లం, శనగపప్పు సమర్పించడం వల్ల మీ జాతకంలో గురుడు స్థానం బలపడుతుంది. 

Also Read: Rajyoga: బుధాదిత్య రాజయోగంతో ఈ రాశులకు ఊహించని ధనలాభం.. ఈ జాబితాలో మీరాశి ఉందా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News