Venus Transit 2024 In Telugu: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్ర గ్రహాన్ని శుభ గ్రహంగా పరిగణించడం ఆనవాయితీగా వస్తోంది.. శుక్ర గ్రహాన్ని సాక్షాత్తు లక్ష్మీదేవిగా భావిస్తారు. కాబట్టి ఈ గ్రహం సంచారం చేసినప్పుడల్లా ఎంతో ప్రత్యేకమైన శుభయోగాలు ఏర్పడతాయి. ఈ శుక్ర గ్రహం సంచారం చేసినప్పుడల్లా మొత్తం 12 రాశుల వారిపై ప్రత్యేకమైన ప్రభావం పడుతుంది. దీని కారణంగా కొందరి జీవితాల్లో సానుకూల మార్పులు వస్తే మరికొన్ని రాశుల వారి జీవితాల్లో ప్రతికూల మార్పులు వచ్చే ఛాన్స్ కూడా ఉందని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఇది ఇలా ఉంటే శుక్ర గ్రహం జూన్ 12వ తేదీన ఎంతో ప్రాముఖ్యత కలిగిన వృషభ రాశిని వదిలి మిధున రాశిలోకి సంచారం చేయబోతోంది. దీంతో కొన్ని రాశుల వారికి ఆనందంతో పాటు శ్రేయస్సు, సంపద లభించే అవకాశాలు ఉన్నాయి. అలాగే జూన్ 28న శుక్రుడు గమనంలో మార్పులు వస్తాయి. దీని కారణంగా కూడా అన్ని రాశుల వారిపై ప్రత్యేక ప్రభావం పడుతుంది. అయితే ఈ సమయంలో ఏయే రాశుల వారికి ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మిథున రాశి: 
మిధున రాశి వారికి శుక్రుడి సంచార ప్రభావం ప్రత్యక్షంగా పడబోతోంది. దీని కారణంగా వీరికి ఆర్థిక లాభాలు కలగడమే కాకుండా ఈ సమయంలో వ్యక్తి అభివృద్ధి ప్రత్యేక మార్గాలు ఏర్పడతాయి. దీంతో పాటు ఉద్యోగాలు చేస్తున్న వారికి ఈ సమయం ఎంతో అనుకూలంగా ఉంటుంది. అలాగే ఆదాయం పెరిగి విపరీతమైన ధన లాభాలు కూడా కలుగుతాయి. వీరికి సమాజంలో గౌరవం, కీర్తి, ప్రతిష్ట లభించడమే కాకుండా నిలిచిపోయిన డబ్బు కూడా పొందుతారు. దీంతోపాటు వైవాహిక జీవితంలో వస్తున్న సమస్యలు కూడా పూర్తిగా పరిష్కారమవుతాయి. అలాగే వ్యక్తిగత జీవితంలో ఒత్తిడి తగ్గి.. ఆనందం పెరుగుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు.


మీన రాశి: 
శుక్రుడి సంచారం కారణంగా మీన రాశి వారికి శుభ కాలం ప్రారంభమవుతుంది. దీని కారణంగా ఈ సమయంలో ఎలాంటి కొత్త పనులు చేసిన వెంటనే ఫలితాలు పొందుతారు. కెరీర్‌కు సంబంధించిన విషయాల్లో అనేక మార్పులు వస్తాయి. ముఖ్యంగా ఈ సమయంలో వ్యాపారాలు చేసేవారు విపరీతంగా లాభాలు పొందుతారు. అలాగే నిలిచిపోయిన పనులన్నీ కూడా ఎంతో సులభంగా పరిష్కారమవుతాయి. నిరుద్యోగులు ఈ సమయంలో ఉద్యోగాలు పొందే ఛాన్స్ కూడా ఉంది. అలాగే వ్యక్తిగత జీవితంలో వస్తున్న కొన్ని సమస్యలు ఎంతో సులభంగా పరిష్కారమవుతాయి. 


Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!


తులారాశి: 
తులా రాశి వారికి జూన్ 12 నుంచి ఎంతో అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది. ఈ సమయంలో వీరు పూర్వికులు ఆస్తి పొందడమే కాకుండా ఆర్థికంగా నష్టపోతున్న వారికి లాభాలు ఏర్పడతాయి. అలాగే కుటుంబ సభ్యులతో సంబంధాలు మరింత మెరుగుపడి జీవితంలో సంతోషం రెట్టింపు అవుతుంది. దీంతోపాటు ఈ రాశి వారు మతపరమైన కార్యక్రమాల్లో కూడా పాల్గొనే ఛాన్స్ ఉంది. దీనికి కారణంగా మీరు అద్భుతమైన లాభాలను పొందగలుగుతారు. అలాగే ఎప్పటి నుంచో వస్తున్న చిన్న చిన్న సమస్యలు వెంటనే పరిష్కారమవుతాయి. మనసులో ఉన్న కోరికలు కూడా నెరవేరే ఛాన్స్ ఉందని జ్యోతిష్యులు చెబుతున్నారు.


Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి