COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Venus Transit 2024: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాల కదలికలను ఎంతో శక్తివంతమైన ప్రక్రియగా పరిగణిస్తారు. అయితే ఫిబ్రవరి 12వ (ఈరోజు) తేదీ రాశి సంచారం చేశాడు. ఈ గ్రహం ధనస్సు రాశి నుంచి మకర రాశిలోకి సంచారం చేసింది. అయితే శుక్రుడు మకర రాశిలోకి సంచారం చేయడం కొన్ని రాశుల వారికి ఎంతో శుభప్రదంగా ఉంటుంది. ఈ సమయంలో ఎవరి జాతకంలోనైతే శుక్రుడు ప్రత్యేక స్థానంలో ఉంటాడు వారికి లక్ష్మీదేవి అనుగ్రహం లభించి అదృష్టవంతులు అవుతారు. అంతేకాకుండా ఆర్థిక పరిస్థితుల్లో కూడా అనేక మార్పులు వస్తాయి. ముఖ్యంగా శుక్ర గ్రహ సంచారంతో కొన్ని రాశుల వారికి మంచి రోజులు ప్రారంభమవుతాయి. అయితే ఈ సమయం ఏ ఏ రాశి వారికి ఎలాంటి లాభాలు కలుగుతాయే ఇప్పుడు తెలుసుకుందాం.


మేష రాశి:
మేష రాశి వారికి శుక్రుడి సంచారం కారణంగా ఈరోజు నుంచి కొన్ని లాభాలు కలుగుతాయి ముఖ్యంగా మానసిక సమస్యలతో బాధపడుతున్న వారికి సమస్య నుంచి సులభంగా విముక్తి లభిస్తుంది దీంతోపాటు వృత్తి డబ్బు సంబంధిత విషయాలు అనేక మార్పులు వస్తాయి. అలాగే ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి ఈ సమయంలో ప్రముఖమైన కంపెనీల నుంచి ఆఫర్స్ లభిస్తాయి.


వృషభ రాశి:
వృషభ రాశివారికి ఈ సమయంలో చిన్న చిన్న సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. దీంతో పాటు కోపాన్ని నియంత్రించుకోవడం చాలా మంచిది. అలాగే స్వీయనియంత్రలో కూడా ఉండాలని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.


మిథున రాశి:
 మకర రాశిలోకి శుక్రుడు సంచారం చేయడం వల్ల మిథున రాశి వారికి కూడా ఊహించని లాభాలు కలుగుతాయి. దీంతో పాటు వీరికి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు కూడా వచ్చే ఛాన్స్‌ ఉంది. ముఖ్యంగా ఉద్యోగాలు చేస్తున్నవారు ఈ సమయంలో జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. అలాగే విభేదాలకు దూరంగా ఉండటం చాలా ఉత్తమని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. 


కర్కాటక రాశి:
శుక్రుడి సంచారం కర్కాటక రాశివారికి చాలా సమస్యలు తెచ్చిపెట్టే అవకాశాలు ఉన్నాయి. దీంతో పాటు మిశ్రమ లాభాలు కలుగుతాయి. ఉద్యోగాలు చేస్తున్నవారికి బాస్‌ నుంచి మద్దతు కూడా లభిస్తుంది. దీంతో పాటు బాధ్యత యుతంగా ముందుకు సాగడం వల్ల సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుంది. 


Also Read Ibomma Downloading Option: ఒకే నిమిషంలో ఐ బొమ్మలో మూవీస్ డౌన్‌లోడ్ చేయడం ఎలా?


సింహ రాశి:
సింహ రాశి వారికి ఈ సమయంలో కొన్ని లాభాలతో పాటు నష్టాలు కూడా కలుగుతాయి. దీంతో పాటు వీరు కోపాన్ని నియంత్రించుకోవడం చాలా మంచిది. దీంతో పాటు ఖర్చులు రెట్టింపు అయ్యే ఛాన్స్‌ ఉంది. కాబట్టి తప్పకుండా పొదుపు చేసేందుకు పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. దీంతో పాటు మానసిక సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. 


Also Read Ibomma Downloading Option: ఒకే నిమిషంలో ఐ బొమ్మలో మూవీస్ డౌన్‌లోడ్ చేయడం ఎలా?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter