COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Venus Transit 2024 In Telugu: శుక్రగ్రహానికి జ్యోతిష్య శాస్త్రంలో ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈ గ్రహం శుభ స్థానంలో ఉన్నవారికి డబ్బు, కీర్తి, ప్రతిష్టల పరంగా ఎలాంటి డోకా ఉండదు. అయితే ఈ గ్రహం కూడా అన్ని గ్రహాల్లా తరచుగా రాశి సంచారం చేస్తూ ఉంటుంది. ఇలా సంచారం చేసినప్పుడు అన్ని రాశులవారిపై ప్రత్యేక ప్రభావం పడుతుంది. అంతేకాకుండా ఈ శుక్ర గ్రహ లక్ష్మీదేవికి సంబంధించిన గ్రహంగా కూడా పరిగణిస్తారు. కాబట్టి ఈ గ్రహం సంచారం చేయడం వల్ల నష్టాల కంటే లాభాలే ఎక్కువగా కలుగుతాయి. ఇది ఇలా ఉండగా ఏప్రిల్ 25వ తేదిన శుక్ర గ్రహం మీన రాశి నుంచి మేష రాశిలోకి సంచారం చేయబోతోంది. ఈ గ్రహం మే నెల వరకు సంచార దశలో ఉంటుంది. అయితే ఈ గ్రహం శుభ స్థానంలో ఉన్న రాశులవారికి లక్ష్మీదేవత అనుగ్రహం లభిస్తుంది. దీని కారణంగా కొన్ని రాశులవారు అదృష్టవంతులు కూడా అవుతారు. అయితే ఈ సమయంలో ఏయే రాశులవారికి ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. 


మేష రాశి:
మేష రాశి వారికి శుక్రుని సంచారం చాలా ప్రయోజనకరంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ముఖ్యంగా ఉద్యోగాలు చేసేవారు ఈ సమయంలో కష్టపడి పనులు చేయడం వల్ల తగిన ఫలితాలను పొందే అవకాశాలు కూడా ఉన్నాయి. దీంతో పాటు ఇంట్లో ఆనందం కూడా రెట్టింపు అవుతుంది. దీని కారణంగా ఇంట్లో ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడుతుంది. అలాగే ప్రేమ జీవితం గడుపుతున్నారికి కూడా అనేక లాభాలు కలుగుతాయి. దీంతో పాటు ఎప్పటి నుంచో ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నవారు ఉద్యోగాలు పొందుతారు.


మిథున రాశి:
మేష రాశిలోకి శుక్రుడు ప్రవేశించడం వల్ల మిథున రాశివారికి కూడా చాలా శుభప్రదంగా ఉంటుంది. ముఖ్యంగా ఉద్యోగాలు చేసేవారికి ఈ సమయం చాలా లాభదాయకంగా ఉంటుంది. అలాగే పెట్టుబడులు పెట్టడం వల్ల విపరీమైన లాభాలు కూడా పొందే అవకాశాలు ఉన్నాయి. దీంతో పాటు ఆర్థికంగా కూడా ఈ సమయం లాభదాయకంగా ఉంటుంది. ఇక భాగస్వామ్య జీవితం గడుపుతున్నవారికి ఈ సమయం శృంగార భరితంగా ఉంటుంది. అంతేకాకుండా వీరికి పూజల పట్ల కూడా ఆసక్తి పెరిగే ఛాన్స్‌ ఉంది. 


Also Read Vivo T3 5G: రూ.20 వేల లోపే శక్తివంతమైన ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి Vivo T3 5G మొబైల్‌.. పూర్తి వివరాలు ఇవే..


ధనుస్సు రాశి:
శుక్రుని రాశిని రాశి మార్పుల కారణంగా ధనస్సు రాశివారికి కూడా చాలా ప్రయోజనకంగా ఉంటుంది. అంతేకాకుండా నిలిపోయిన పనులు కూడా సులభంగా జరుగుతాయి. అలాగే ఆరోగ్య కూడా మెరుగుపడి, అన్ని అనారోగ్య సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. దీంతో పాటు శృంగారంపై ఎంతో ఆసక్తి పెరుగుతుంది. అలాగే వీరు చిన్న చిన్న ప్రయాణాలు కూడా చేసే అవకాశాలు ఉన్నాయి. దీంతో పాటు వృత్తి జీవితం గడుపుతున్నవారికి ఈ సమయం చాలా బాగుటుంది. అంతేకాకుండా ఆర్థిక స్థితులు కూడా చాలా బాగుంటాయి. 


Also Read Vivo T3 5G: రూ.20 వేల లోపే శక్తివంతమైన ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి Vivo T3 5G మొబైల్‌.. పూర్తి వివరాలు ఇవే..


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి