Shukra Gochar 2023: మేషరాశిలో సంచరించిన శుక్రుడు... ఈ 5 రాశులకు బంపర్ బెనిఫిట్స్..
Shukra Gochar 2023: ఇవాళ శుక్రుడు మేషరాశిలోకి ఎంటర్ అయ్యాడు. శుక్రుడి రాశి మార్పు కారణంగా కొన్ని రాశులవారు అపారమైన ప్రయోజనాలను పొందనున్నారు.
Shukra Gochar 2023: ప్రేమ, రొమాన్స్, అందం మరియు లగ్జరీ లైఫ్ కు శుక్రుడు కారకుడు. ఇవాళ అంటే మార్చి 12న శుక్రుడు మేషరాశిలోకి ప్రవేశించాడు. ఆస్ట్రాలజీలో శుక్రుడి రాశి మార్పును శుభప్రదంగా భావిస్తారు. మేషరాశిలో శుక్ర సంచారం వల్ల కొన్ని ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. శుక్రుడి రాశిలో మార్పు ఏయే రాశులవారికి శుభప్రదంగా ఉంటుందో తెలుసుకుందాం.
శుక్రుడి సంచారం ఈ రాశులకు వరం
మేషం (Aries): శుక్ర గ్రహం ఈ రాశిలోనే సంచరించింది. దీంతో ఈ రాశివారు అపారమైన ప్రయోజనాలు పొందుతారు. మీరు మీ వ్యక్తిత్వంతో ఇతరులను ఆకట్టుకుంటారు. కుటుంబంలో సంతోషం నెలకొంటుంది. దాంపత్య జీవితం బాగుంటుంది. మీ ఆదాయం రెట్టింపు అవుతుంది.
మిథునం (Gemini): మీకు ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. ఆఫీసులో మిథున రాశికి చెందిన వ్యక్తులు ప్రశంసలు పొందుతారు. ఉద్యోగులు ప్రమోషన్ లేదా ఇంక్రిమెంట్ దక్కే అవకాశం ఉంది. మీ జీవితంలో ఆనందం వెల్లివిరిస్తుంది. మీరు ఇల్లు లేదా కారు కొనుగోలు చేసే అవకాశం ఉంది.
సింహం (leo); సింహ రాశి వారికి శుక్ర సంచారం అనుకూల ఫలితాలను ఇస్తుంది. ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగాలు మారే అవకాశాలు ఉన్నాయి. మీరు మంచి కంపెనీ నుండి జాబ్ ఆఫర్ పొందుతారు. ఫ్యామిలీ సపోర్టు లభిస్తుంది.
ధనస్సు (Sagittarius): ధనుస్సు రాశి వారికి శుక్రుని సంచారం చాలా మేలు చేస్తుంది. లవ్ లైవ్ బాగుంటుంది. మీ కాపురం అద్భుతంగా ఉంటుంది. మీ సమస్యలన్నీ తీరిపోతాయి. చాలా డబ్బు సందిస్తారు.
మీనం (Pisces): మీన రాశి వారికి ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. అత్తమామల సపోర్టుతో మంచి లాభాలను పొందుతారు. ఈ సమయం కెరీర్‌కు అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగంలో ప్రమోషన్ ఉంటుంది. ఆదాయం రెట్టింపు అవుతుంది. ఖర్చులు కూడా పెరుగుతాయి.
Also Read: Budhaditya Rajyog: మీనరాశిలో బుధాదిత్య రాజయోగం.. ఈ రాశులకు తిరుగులేనంత ధనం..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook