Venus Transit 2022: శుక్రుని రాశిలో మార్పు ఆర్థిక స్థితి, సుఖాలు, ప్రేమ జీవితంపై అధిక ప్రభావాన్ని చూపుతుంది. మే 23న శుక్ర గ్రహం రాశిచక్రాన్ని మార్చబోతోంది. మేషరాశిలో శుక్రుని ప్రవేశం (venus transit in aries 23) అన్ని రాశులపై పెద్ద ప్రభావాన్ని చూపుతుంది. మే 23 నుండి జూన్ 18 వరకు శుక్రుడు మేషరాశిలో ఉంటాడు. శుక్ర సంచారం 5 రాశుల వారికి శుభ ఫలితాలను ఇస్తుంది. ఆ రాశులేంటో చూద్దాం రండి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ 5 రాశులవారిపై శుక్రుని అనుగ్రహం ఉంటుంది
మేషం (Aries): మేషరాశిలో శుక్ర గ్రహ ప్రవేశం ఈ రాశి వారికి చాలా లాభాలను ఇస్తుంది. కెరీర్‌లో పురోగతి సాధించే అవకాశం ఉంటుంది. మీరు కొత్త ఉద్యోగ ప్రతిపాదనను పొందవచ్చు. ప్రమోషన్ ఉండవచ్చు. ధనం లాభదాయకంగా ఉంటుంది. జీవితంలో ప్రేమ,శృంగారం పెరుగుతుంది.


మిథునం (Gemini): మేషరాశిలో శుక్ర సంచారం మిథునరాశి వారికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ధనం లాభదాయకంగా ఉంటుంది. ఆదాయం పెరగవచ్చు. జీవితంలో ఆనందం ఉంటుంది. కుటుంబంలో నవ్వుల వాతావరణం ఉంటుంది. కొత్తగా పెళ్లయిన వారికి పిల్లలకు సంబంధించిన శుభవార్తలు అందుతాయి. 


సింహం (Leo): శుక్రుడు రాశి మారడం వల్ల సింహరాశి వారికి అదృష్టం బలపడుతుంది. ప్రతి విషయంలోనూ విజయం సాధిస్తాడు. మీకు గౌరవం లభిస్తుంది. కెరీర్‌లో గొప్ప విజయం సాధించవచ్చు. కొత్త ఉద్యోగం పొందవచ్చు. నిరుద్యోగుల అన్వేషణ ముగియవచ్చు. వ్యాపారులు లాభపడతారు. కొందరి నివాస స్థలం లేదా పని మారవచ్చు. 


మకరం (Capicron): మేషరాశిలో శుక్రుని సంచారం మకర రాశి వారికి జీవితంలో అనేక ఆహ్లాదకరమైన మార్పులను తెస్తుంది. ప్రేమలో ఉన్నవారు పెళ్లి చేసుకోవచ్చు. పెళ్లైన వారి జీవితంలో కూడా ఆనందం ఉంటుంది. ఇల్లు-కారు కొనడానికి ఇది మంచి సమయం. ఆదాయం పెరగవచ్చు.


కుంభం (Aquarius): కుంభ రాశి వారికి శుక్రుని మార్పు శుభప్రదం అవుతుంది. వారు ఉద్యోగంలో ప్రమోషన్ పొందవచ్చు. గ్లామర్ రంగానికి చెందిన వారికి, ఈ సమయం ముఖ్యంగా శుభప్రదం. కమ్యూనికేషన్ బాగా ఉంటుంది. ప్రజలపై సులభంగా ముద్ర వేస్తారు. ప్రయాణాలు చేసే అవకాశాలు ఉన్నాయి.


Also Read: Rahu Ketu Transit: రాహు, కేతువు సంచారం.. 2023 వరకు ఈ 3 రాశుల వారికి డబ్బే డబ్బు!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook