Venus Transit 2022: మరో 4 రోజుల్లో శుక్ర సంచారం.. ఈ 3 రాశులవారికి అంతులేని ఐశ్వర్యం!
Venus Transit 2022: శుక్ర గ్రహం...ప్రేమ, శృంగారం, ఐశ్వర్యానికి కారకుడు. ఇతడు మరో నాలుగు రోజుల్లో తన రాశిని మార్చబోతున్నాడు. దీని సంచారం వల్ల 3 రాశులవారు లాభపడనున్నారు.
Venus Transit 2022 Effect: ప్రతి గ్రహం నిర్ధిష్ట సమయం తర్వాత తన రాశిని మార్చుకుంటుంది. దీని ప్రభావం మెుత్తం 12 రాశిచక్ర గుర్తులపై ఉంటుంది. ఆగస్టు నెలలో నాలుగు పెద్ద గ్రహాలు తమ రాశిని మార్చకోబోతున్నాయి. ఈ నేపథ్యంలో ఆగస్టు 7న శుక్రుడు కర్కాటక రాశిలోకి (Venus Transit in Cancer 2022) ప్రవేశించనున్నాడు. ప్రేమ, శృంగారం, ఐశ్వర్యానికి కారకుడు శుక్రుడు. దీని సంచారం మూడు రాశులవారికి శుభప్రదంగా ఉండనుంది. ఆ రాశులేంటో తెలుసుకుందాం.
కన్య రాశి(Virgo) - శుక్రుడు రాశి మార్పు వల్ల కన్యా రాశివారికి గోల్డెన్ డేస్ మెుదలవ్వనున్నాయి. ఈ రాశిలో శుక్రుడు 11వ ఇంట్లో సంచరించబోతున్నాడు. దీని వల్ల వీరి ఆదాయం పెరుగుతుంది. అనేక రకాలుగా డబ్బు రావడం మెుదలవుతుంది. మీడియా, సినిమా, బ్యాంకింగ్ లేదా ఫ్యాషన్ డిజైనింగ్ కెరీర్‌తో సంబంధం ఉన్న వ్యక్తులకు ఈ సమయం బాగా కలిసి వస్తుంది. ఈ రాశివారు వ్యాపారం వృద్ధి చెందుతుంది. మరకతం ధరంచడం వల్ల అదృష్టం వస్తుంది.
తుల (Libra)- శుక్ర గ్రహం ఈ రాశి యెుక్క దశమ స్థానంలో సంచరిస్తాడు. ఈ రాశివారికి కొత్త జాబ్ వస్తుంది. ఉద్యోగంలో ప్రమోషన్ లభిస్తుంది. వ్యాపారాన్ని విస్తరించి.. భారీ స్థాయిలో లాభాలను ఆర్జిస్తారు. ఆఫీసులో కోలిగ్స్ మద్దతు ఉంటుంది. పచ్చని ధరించడం వల్ల ఈ రాశివారికి అదృష్టం వస్తుంది. ఈ రాశికి శుక్రుడు అధిపతి కావడం వీరు బాగా లాభపడతారు.
సింహం (Leo) - శుక్రుడు ఈ రాశిచక్రంలోని రెండవ ఇంటిలో సంచరించబోతున్నారు. ఇది సంపద మరియు ప్రసంగం యొక్క ప్రదేశంగా భావిస్తారు. సింహ రాశి వారు ఈ కాలంలో అనేక రకాలుగా డబ్బు సంపాదిస్తారు. వ్యాపారంలో పెద్ద ఒప్పందాన్ని కుదుర్చుకునే అవకాశం ఉంది. పార్టనర్ షిప్ తో పనిచేయడం వల్ల వీరు భారీగా లాభపడతారు.
Also Read: Wednesday Remedies: మీ కెరీర్‌లో అడ్డంకులున్నాయా? అయితే బుధవారం ఈ పరిహారాలు చేయండి
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook