Shukra Gochar December 2022: ప్రజలకు సుఖసంతోషాలు, లగ్జరీ లైఫ్ ను ఇచ్చే శుక్రుడు డిసెంబరు 29న మకరరాశిలో సంచరించబోతున్నాడు. మళ్లీ కొత్త ఏడాదిలో అంటే జనవరి 17, 2023న కుంభరాశిలో సంచరించనున్నాడు. శుక్రగ్రహం యెుక్క ఈ రాశిమార్పు (Venus transit in Capricorn 2022) కొన్ని రాశులకు శుభప్రదంగానూ, మరికొందరికి అశుభంగానూ ఉంటుంది. ఈ శుక్రుడి సంచారం కారణంగా నూతన సంవత్సరంలో నాలుగు రాశులవారు తీవ్ర ఇబ్బందులు పడే అవకాశం ఉంది. ఆ దురదృష్ట రాశులేంటో తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మీనం (Pisces): శుక్రుడి సంచారం కారణంగా ఈరాశివారు అనేక ఇబ్బందులు ఎదుర్కోననున్నారు. ఆరోగ్యం చెడిపోయే అవకాశం ఉంది. లైఫ్ పార్టనర్ తో విభేదాలు రావచ్చు. మిమ్మిల్ని అనారోగ్య సమస్యలు చుట్టిముడతాయి. డబ్బు సంపాదించే అవకాశాలను కోల్పోతారు. మెుత్తానికి ఈ సమయం మీకు కష్టంగా ఉంటుంది. 


మకరం (Capricorn): శుక్రుడి ఈ రాశి మార్పు మీకు అనేక సమస్యలను తెచ్చిపెడుతుంది. మీ తోబుట్టువులతో సంబంధాలు చెడిపోయే అవకాశం ఉంది. మీకు ఉద్యోగంలో ఇబ్బందులు ఎదురవుతాయి. ఇలాంటి సమయాల్లో ప్రశాంతంగా ఉండి, అవగాహనతో సమస్యకు పరిష్కారం కనుగొనే ప్రయత్నం చేస్తే మంచిది. 


కన్య (Virgo): ఈ రాశికి చెందిన వారు శుక్రుని సంచార సమయంలో జాగ్రత్తగా ఉండాలి. స్వల్ప లాభం కోసం ఎలాంటి అనైతిక లేదా చట్టవిరుద్ధమైన పనిని చేయవద్దు. రోడ్డు మీద డ్రైవింగ్ చేసేటప్పుడు పూర్తి జాగ్రత్తలు తీసుకోండి, లేకుంటే మీకు ప్రమాదం జరిగే అవకాశం ఉంది. మీ ప్రత్యర్థుల పట్ల అప్రమత్తంగా ఉండండి. 


తుల (Libra): ఈ సంవత్సరం చివరి శుక్ర సంచారం తులారాశిపై కూడా ప్రభావం చూపుతుంది. మీరు పొరపాటున కూడా తెలియని వారి నుండి కొనుగోలు చేయకపోవడమే మంచిది. ఇలా చేయడం వల్ల మీరు ఇబ్బందుల్లో పడవచ్చు. అదే విధంగా తక్కువ డబ్బుతో కొనుగోలు చేసిన వస్తువులు మీకు ఎటువంటి ప్రయోజనం కలిగించవు లేదా మీరు వాటిని ఆనందించలేరు.


Also Read: Shani Gochar 2023: కొత్త ఏడాదిలో అరుదైన యోగం చేస్తున్న శనిదేవుడు.. ఈ రాశులకు ఆర్థికంగా లాభం.. 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook