Venus Transit 2023: గ్రహాల్లో అత్యంత కీలకమైన శుక్రగ్రహం గోచారం గురించి ఇప్పుడు పరిశీలిద్దాం. శుక్రుడి రాశి పరివర్తనం ప్రభావంతో కొంతమందికి అద్భుతమైన లాభాలు కలగనున్నాయి. ముఖ్యంగా విదేశీ కొలువులు లభించనున్నాయి. ఆ వివరాలు మీ కోసం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం శుక్రుడు మే 2వ తేదీ అంటే రేపు మద్యాహ్నం 2.33 గంటలకు మిధున రాశిలో ప్రవేశించనున్నాడు. దాదాపు ఓ నెలరోజులు అదే రాశిలో ఉపస్థితుడై ఉంటాడు. మే 30వ తేదీ సాయంత్రం 7.40 గంటలకు కర్కాటక రాశిలోకి మారిపోనుంది శుక్ర గ్రహం. ఈ రాశి పరివర్తనం ప్రభావం కొంతమందికి ఊహించని లాభాలు కలగజేయనుంది. కొంతమందికి మిశ్రమ ఫలితాలు కూడా ఉంటాయి. కొంతమందికి ప్రతికూలంగా ఉంటుంది. ఉద్యోగం కోసం నిరీక్షిస్తున్నవాళ్లు మరింతగా కష్టపడాల్సివస్తుంది. కొన్ని పనులు పూర్తయితే..మరికొన్ని నిలిచిపోతాయి. టెక్నికల్ రంగంలో ఉండి విదేశీ కొలువు కోసం ఎదురుచూస్తుంటే ఆ కల నెరవేరుతుంది. విదేశాల్లో ఉద్యోగం చేసే అవకాశం లభిస్తుంది. 


వ్యాపారులైతే బ్రాండ్ ప్రచారం కోసం ఖర్చు చేయాల్సి ఉంటుంది. ప్రకటనలు పెద్దఎత్తున ఇవ్వాల్సి ఉంటుంది. మరోవైపు సోషల్ మీడియా రంగాన్ని విస్తృతంగా ఉపయోగించుకోవల్సి ఉంటుంది. ఇక షేర్ మార్కెట్ రంగంలో ఉండేవాళ్లు చాలా అప్రమత్తంగా ఉండాలి. ఆర్ధికంగా లాభాల కోసం అనాలోచితంగా పెట్టుబడులు పెట్టకూడదు. ఆర్ధికంగా పటిష్టంగా ఉండేందుకు పొదుపుపై దృష్టి పెట్టాలి.


విద్యార్ధులు మరింతగా కష్టపడాల్సివస్తుంది. అలసత్వం మంచిది కాదు. శారీరకంగా, మానసికంగా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండేందుకు వ్యాయామం తప్పనిసరిగా చేయాలి. దీనివల్ల చదువుపై ఏకాగ్రత పెరుగుతుంది. కష్టపడితే శుక్రుడిలానే వజ్రంలా మారుతారు. కర్కాటక రాశి వారికి శుక్రుడి రాశి పరివర్తనం ప్రభావంతో ఖర్చులు పెరుగుతాయి. వచ్చిన ఆదాయం ఖర్చులకు పోతుంది. దూర ప్రయాణాలు చేయవచ్చు. విదేశీ యానం ఈ జాతకంలో రాసిపెట్టుంది. ఆర్ధికంగా జాగ్రత్తగా ఉండాలి.. 


సౌకర్యాలు, విలాసవంతమైన వస్తువులు కొనుగోలు చేయవచ్చు. ఇంట్లో పాత సామాను తీసివేసి కొత్త ఫర్నీచర్ కొనుగోలు చేస్తారు. ఇంట్లో కొత్త వస్తువులు కొనాలనే ఆలోచన ఉంటే వెంటనే చేస్తారు. ఎందుకంటే ఈ రాశివారికి ఈ నెలంతా ఖర్చులు చేసే పరిస్థితే ఉంటుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. ఆహారపు అలవాట్లపై దృష్టి పెట్టాలి. యూరిన్ ఇన్‌ఫెక్షన్ లేదా కంటి సంబంధిత ఇన్‌ఫెక్షన్ సమస్యగా మారవచ్చు. వైద్యుడిని సంప్రదించాలి.


Also read: Gajalaxmi Rajayogam Effect: గజలక్ష్మీ రాజయోగం ఆ 5 రాశుల జీవితాల్ని మార్చేస్తుంది, వద్దంటే డబ్బులు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook