Shukra Gochar in Singh 2022:  ఆస్ట్రాలజీ ప్రకారం, ప్రతి గ్రహం ఒక నిర్దిష్ట సమయంలో తన రాశిని మారుస్తూ ఉంటుంది. మూడు రోజుల తర్వాత శుక్ర గ్రహం తన రాశిని మార్చనుంది. 31 ఆగస్టు 2022న శుక్రుడు సింహరాశిలో (Venus transit in leo 2022) సంచరించనున్నాడు. శుక్రుని రాశి మార్పు మూడు రాశులవారికి కలిసిరానుంది. శుక్రుని అనుగ్రహం వల్ల ఈ రాశులవారికి ధనప్రాప్తి కలుగనుంది. శుక్రుని సంచారం ఏ రాశులకు శుభప్రదంగా ఉండనుందో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

లక్కీ రాశులు ఇవే..


తుల (Libra): శుక్రుని సంచారం తులారాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. ఆదాయం పెరుగుతుంది. కెరీర్ లో పురోగతి ఉంటుంది. ముఖ్యంగా సినిమా, మీడియా, గ్లామర్ రంగాలతో అనుబంధం ఉన్న వారికి ఈ సమయం కలిసి వస్తుంది. కొత్త జాబ్ వస్తుంది. పలుకబడి పెరుగుతుంది. 


కర్కాటక రాశి (Cancer): శుక్రుడు రాశిలో మార్పు కర్కాటక రాశి వారికి చాలా ప్రయోజనాలను ఇస్తుంది. వారికి ఊహించని ధనలాభం ఉంటుంది. ఇరుక్కుపోయిన ధనం మీకు అందుతుంది. వ్యాపారులు పెద్ద పెద్ద ఆర్డర్‌లను పొందుతారు. 


వృశ్చికం (Scorpio): సింహరాశిలో శుక్రుడు సంచరించడం వల్ల వృశ్చిక రాశి వారికి అద్భుతమైన ప్రయోజనాలను పొందనున్నారు. కెరీర్ లో పురోగతి సాధిస్తారు. వ్యాపారులకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. బిజినెస్ విస్తరిస్తారు. కొత్త పరిచయాలు లాభిస్తాయి. 


Also Read: Ketu Transit 2022: కేతువు సంచారం... ఈ 3 రాశులవారి దశ తిరగడం పక్కా..!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook