Shukra nakshatra Gochar 2024: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, గ్రహాల నక్షత్ర మార్పు ప్రజలందరి జీవితాలపై పెను ప్రభావాన్ని చూపుతాయి. రాక్షసుల గురువైన శుక్రుడు రేపు అంటే మార్చి 23వ తేదీ మధ్యాహ్నం 2:47 గంటలకు పూర్వాభాద్రపద నక్షత్రంలోకి ప్రవేశించనున్నాడు. అదే నక్షత్రంలో ఏప్రిల్ 03 వరకు ఉంటాడు. దీని తర్వాత శుక్రాచార్యుడు ఉత్తర భాద్రపద నక్షత్రంలోకి వెళ్తాడు. పూర్వాభాద్రపద నక్షత్రానికి అధిపతి దేవతల గురువు బృహస్పతి. ఈ నక్షత్రంలో పుట్టిన వారు ఎవరైనా చాలా అదృష్టవంతులనే చెప్పాలి. మరి గురుడు నక్షత్రంలోకి శుక్రుడు ప్రవేశం వల్ల మూడు రాశులవారు మునుపెన్నడూ చూడని ప్రయోజనాలను పొందుతారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కన్యా రాశి: శుక్రుడి యెుక్క గమనంలో మార్పు కన్యారాశి వారికి సానుకూలంగా ఉంటుంది. వీరు కెరీర్ కు సంబంధించిన కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మీరు అప్పుల ఊబి నుండి బయటపడతారు. మీరు లవ్ లో విజయం సాధిస్తారు. ఆఫీసులో మీకు సహోద్యోగుల సపోర్టు లభిస్తుంది. మీ వైవాహిక జీవితం అద్భుతంగా ఉంటుంది. మీకు సంతానసుఖం కలిగే అవకాశం ఉంది. మీరు ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. 


కర్కాటక రాశి: శుక్రుడు నక్షత్ర మార్పు కర్కాటక రాశి వారికి అదృష్టంతోపాటు ఐశ్వర్యాన్ని ఇవ్వబోతుంది. మీ కెరీర్ లో ఊహించని స్థాయికి వెళతారు. మీ ఆర్థిక స్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. మీ బ్యాంక్ బ్యాలెన్స్ రెట్టింపు అవుతుంది. మీరు మానసిక ఒత్తిడి నుండి బయటపడతారు. పెట్టుబడులు లాభిస్తాయి. ఆఫీసులో మీరు చేసిన ప్రాజెక్టు సక్సెస్ అవ్వడంతో మీకు ప్రశంసలు లభిస్తాయి. 


మేష రాశి: పూర్వాభాద్రపద నక్షత్రంలో శుక్రుడు సంచారం మేషరాశి వారికి అనుకూల ఫలితాలను ఇస్తుంది. వీరు వ్యాపారంలో గతంలో సాధించిన లాభాల కంటే ఎక్కువ ప్రాఫిట్స్ ను పొందుతారు. మీరు ఆరోగ్యంగా ఉంటారు. ఈ సమయంలో ఎందులో పెట్టుబడి పెట్టిన అవి రెట్టింపు లాభాలను ఇస్తాయి. మీ కోరికలు నెరవేరే అవకాశం ఉంది. మీ పేరు ప్రఖ్యాతలు సంపాదిస్తారు. 


Also Read: Chandra Grahan 2024: మార్చి 25న మెుదటి చంద్రగ్రహణం.. ఈ 3 రాశులకు బ్యాడ్ టైమ్..


Also Read: April Rasi Phalalu 2024: మరో 10 రోజుల తర్వాత ధనవంతులు కాబోతున్న రాశులివే..!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి