April Rasi phalalu 2024: ప్రతి గ్రహం ఒక్కో రాశిలో కొంత సమయం గడిపి ఆ తర్వాత వేరోక రాశిలోకి ప్రవేశిస్తుంది. ఈనెల 31న సాయంత్రం 4:45 గంటలకు శుక్రుడు కూడా తన రాశిని మార్చబోతున్నాడు. శుక్ర గ్రహం ప్రస్తుతం ఉన్న కుంభ రాశిని విడిచిపెట్టి మీనరాశి ప్రవేశం చేయబోతున్నాడు. ఇదే సమయంలో శుక్రుడు.. సూర్యుడు మరియు రాహువుతో కలవబోతున్నాడు. అంతేకాకుండా శుక్ర గ్రహం మీనరాశిలో ఉచ్ఛస్థితిలో ఉండటం వల్ల మాళవ్య రాజ్యయోగం రూపొందుతుంది. శుక్రుడి చేస్తున్న ఈ రాజయోగం వల్ల ఏయే రాశులవారు ప్రత్యేక ప్రయోజనాలు పొందబోతున్నారో తెలుసుకుందాం.
మీనరాశి
ఇదే రాశిలో శుక్రుడు ప్రవేశించడం వల్ల మాలవ్య రాజయోగం ఏర్పడుతోంది. మీరు కెరీర్ కు సంబంధించిన శుభవార్త వింటారు. ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తో మంచి సమయం గడుపుతారు. అంతేకాకుండా ఏదైనా టూర్ కు వెళ్లే అవకాశం ఉంది. మీరు చేపట్టిన పనిని అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. మీ ఆర్థికస్థితి మునుపటి కంటే బలపడుతుంది. మీరు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.
మేష రాశి
శుక్రుడు చేయబోతున్న మాళవ్య రాజ్యయోగం వల్ల మేషరాశి వారు జీవితంలో ఏ కష్టాలు లేకుండా సాఫీగా సాగిపోతుంది. మీరు కెరీర్ లో చాలా ఎత్తుకు చేరుకుంటారు. మీ పనులన్నీ వెనువెంటనే పూర్తవుతాయి. సొంత వ్యాపారం మెుదలుపెట్టాలనుకుంటే ఇదే తగిన సమయం. ప్రేమికులు తమ ప్రేమలో మునిగిపోతారు. మీ దాంపత్య జీవితం బాగుంటుంది.
సింహరాశి
సింహరాశి వారికి శుక్రుడు రాశి మార్పు ఎంతో కలిసి వస్తుంది. మీకు సంతానప్రాప్తి కలుగుతుంది. మీరు చాలా విలాసవంతమైన జీవితం గడుపుతారు. భార్యభర్తల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోతాయి. మీ ఆర్థిక పరిస్థితిలో మార్పు వస్తుంది. మీ పనులన్నీ అనుకున్న సమయానికి పూర్తవుతాయి. మీ చేతికి అకస్మాత్తుగా డబ్బు అందుతుంది.
(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)
Also Read: Chandra Grahan 2024: తొలి చంద్రగ్రహణం రాబోతుంది.. ఈ 3 రాశులకు అదృష్టాన్ని ఇస్తుంది..
Also Read: Solar Eclipse 2024: సోమవతి అమావాస్య రోజే సూర్యగ్రహణం..ఈ రాశులవారికి విపరీతమైన లాభాలు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి