Shukra Gochar 2022: త్వరలో ధనుస్సు రాశిలోకి శుక్రుడు... వీరి అదృష్టం మారుతుంది చూడు..
Shukra Gochar 2022: శుక్రుడు ధనుస్సు రాశిలోకి త్వరలో ప్రవేశించనున్నాడు. దీంతో ఈ సంచారం కొందరికి అనుకూలంగానూ, మరికొందరికి ప్రతికూలంగానూ ఉంటుంది.
Grah Rashi Parivartan 2022: లవ్, రొమాన్స్, లగ్జరీ లైఫ్, మనీ ఇచ్చే దేవుడు శుక్రుడు. ఆస్ట్రాలజీలో ఇతడి సంచారాన్ని శుభప్రదంగా భావిస్తారు. అలాంటి శుక్రుడు డిసెంబరు 5, సాయంత్రం 5:39 గంటలకు ధనుస్సు రాశిలోకి ప్రవేశిస్తాడు. శుక్రుడి సంచారం (Shukra Gochar 2022) అన్ని రాశులవారిని ప్రభావితం చేస్తుంది. ఇది కొన్ని రాశులకు శుభప్రదంగానూ, మరికొందరికి అశుభకరంగానూ ఉంటుంది. ధనస్సు రాశిలో శుక్రుడి సంచారం ఏ రాశివారికి ఎలా ఉంటుందో తెలుసుకుందాం.
వృషభం (Taurus): ఈ రాశి యెుక్క లగ్నానికి మరియు ఆరవ ఇంటికి అధిపతి శుక్రుడు. మీ జాతకంలో శుక్రుడు ఎనిమిదవ ఇంట్లో సంచరిస్తాడు. దీంతో మీరు మిశ్రమ ఫలితాలను పొందుతారు. ఈ సమయంలో మీరు ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటారు. కాబట్టి హెల్త్ పై శ్రద్ధ తీసుకోండి.
మిధునరాశి (Gemini): మిథున రాశి యెుక్క ఏడో ఇంట్లో శుక్రుని సంచారం ఉంటుంది. దీంతో ఈ రాశివారు వివాహం జరగాలని యాగాలు చేస్తారు. వ్యాపారానికి సమయం అనుకూలంగా ఉంటుంది. అయితే, కొంత నష్టం కూడా ఉండవచ్చు.
కర్కాటకం (Cancer): కర్కాటక రాశి వారికి శుక్రుని సంచారం ఆరో ఇంట్లో జరుగుతుంది. ఎవరినీ గుడ్డిగా నమ్మవద్దు, అలా చేయడం వల్ల మీకు హాని కలుగుతుంది. కుటుంబ కలహాల కారణంగా తల్లి ఆరోగ్యం క్షీణించవచ్చు.
సింహరాశి (Leo): సింహ రాశి వారికి శుక్రుడు మూడవ మరియు దశమ గృహాలకు అధిపతి. కళలు తదితర రంగాలతో అనుబంధం ఉన్న విద్యార్థులు కూడా మెరుగైన ఫలితాలు పొందవచ్చు. ప్రేమ వ్యవహారాలు అనుకూలిస్తాయి.
వృశ్చిక రాశి (Scorpio): ధనుస్సు రాశిలో శుక్రుడు సంచరించడం వల్ల ఈ రాశి వారికి ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి. పెట్టుబడి పెట్టడానికి ఇదే మంచి సమయం. మీకు వ్యాపారంలో కూడా లాభం ఉంటుంది.
ధనుస్సు రాశి (Sagittarius): ఆర్థికంగా ధన ప్రవాహం బాగానే ఉంటుంది. ఈ కాలంలో ఆదాయాన్ని పెంచుకోవడానికి మరియు ప్రయోజనాలను పొందడానికి అనేక అవకాశాలను ఏర్పడతాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
Also Read: 2022 November Grah Gochar: 3 రోజుల్లో రాశిచక్రం మారనున్న 2 గ్రహాలు... ఈ రాశులకు డబ్బే డబ్బు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook