Venus Transit 2023: శుభ్రగ్రహంగా భావించే శుక్రుడు రాశి మారనున్నాడు. ఫలితంగా మొత్తం 12 రాశులపై ప్రభావం పడుతుంది. ముఖ్యంగా మూడు రాశులవారికి జనవరి నుంచి పట్టిందల్లా బంగారం కానుంది. ఈ మూడు రాశులకు మహర్దశ పట్టనుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

హిందూ జ్యోతిష్యం ప్రకారం శుక్రుడిని ధనం, వైభవం, విలాసానికి ప్రతీకగా పరిగణిస్తారు. అందుకే ఈ గ్రహం గోచారంతో కొన్ని రాశుల జీవనశైలి, సుఖ సంతోషాలు, ఆర్ధిక పరిస్థితిపై తప్పకుండా ప్రభావం కన్పిస్తుంది. శుక్రుడి ఇటీవల వృశ్చిక రాశిలో ప్రవేశించాడు. వచ్చే ఏడాది జనవరి 18 వరకూ అదే రాశిలో ఉంటాడు. వృశ్చిక రాశికి అధిపతి మంగళ గ్రహం. శుక్ర,మంగళ గ్రహాలు మిత్రులైనందున శుక్రుడి గోచారంతో కొన్ని రాశులకు అద్భుతమైన లాభాలు కలగనున్నాయంటారు జ్యోతిష్యులు. ఈ రాశులకు మహర్దశ పట్టనుంది. చేపట్టిన అన్ని పనులు విజయవంతంగా పూర్తవుతాయి. శుక్ర గోచారంతో ఏయే రాశులకు లబ్ది చేకూరనుందో తెలుసుకుందాం..


వృశ్చిక రాశి జాతకులకు శుక్రుడి గోచారం కారణంగా ఊహించని లాభాలు కలగనున్నాయి. వ్యాపారులకు అమితమైన లాభాలుంటాయి. ఉద్యోగులకు పదోన్నతి లేదా కొత్త ఉద్యోగావకాశాలు కలుగుతాయి. కుటుంబసభ్యులతో సంబంధాలు మెరుగ్గా ఉంటాయి. దాంపత్య జీవితంలో సుఖసంతోషాలుంటాయి. ఆదాయ మార్గాలు పెరగడం వల్ల ఆర్ధిక పరిస్థితి పటిష్టంగా ఉంటుంది. మరోవైపు ఆకశ్మిక ధనలాభం కూడా కలగవచ్చు. శుక్రుడి గోచారం కారణంగా శుక్రుడి శైలి సుఖసంతోషాలు ప్రాప్తిస్తాయి. 


మీన రాశి జాతకులకు శుక్రుడి రాశి పరివర్తనం ప్రభావంతో అత్యంత ప్రయోజనం చేకూరనుంది. ధన సంపదలు కలగడమే కాకుండా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఉద్యోగులు, వ్యాపారులకు ఊహించని లాభాలు కలుగుతాయి.వ్యాపారులు తమ వ్యాపారాన్ని విస్తృతం చేసుకునే అవకాశాలున్నాయి. చేపట్టిన పని విజయవంతంగా పూర్తవుతుంది. 


శుక్రుడి గోచారంతో వృషభ రాశి జాతకులకు ఊహించని లాభాలు అందవచ్చు. జీవితంలో అన్ని రకాల సుఖ సంతోషాలు చవిచూస్తారు. సమాజంలో గౌరవ ప్రతిష్ఠలు పెరుగుతాయి. కొత్త ఇళ్లు, కొత్త వాహనం కొనుగోలు చేస్తారు. చేపట్టిన ప్రతి పనిలో విజయం మీదే అవుతుంది. జీవిత భాగస్వామి కెరీర్‌లో ఎదుగుదల కన్పిస్తుంది. ఉద్యోగులు, వ్యాపారులకు విశేషమైన లాభాలుంటాయి. ఉద్యోగులకు కొత్త ఉద్యోగ అవకాశాలు లాభిస్తాయి. ఆదాయ మార్గాలు పెరగడం వల్ల ఆర్ధికంగా మంచి స్తితిలో ఉంటారు. ఆరోగ్యం విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. 


Also read: Vastu Tips: వాస్తు ప్రకారం దక్షిణ దిశలో పెట్టకూడని మొక్కలు..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook