venus mercury conjunction 2022: బుధుడు-శుక్రుడు సంయోగం.. జూన్ 18 నుంచి ఈ రాశులవారిపై కనక వర్షం!
VenusTransit in Taurus 2022: మరో రెండు రోజుల్లో శుక్రుడు తన సొంత రాశి అయిన వృషభరాశిలోకి ప్రవేశించనున్నాడు. దీని ప్రభావం అన్ని రాశులపై ఉంటుంది.
Shukra Rashi Parivartan 2022: శుక్రుడు తన రాశిని మార్చబోతుంది. మేషరాశిలో ఉన్న శుక్రుడు జూన్ 18న వృషభరాశిలోకి (VenusTransit in Taurus 2022) ప్రవేశించనున్నాడు. ప్రస్తుతం వృషభరాశిలో బుధుడు ఉన్నాడు. జూలై 13 వరకు అక్కడే ఉంటారు. ఇప్పుడు ఈ రెండు రాశుల సంయోగం (venus mercury conjunction 2022) మెుత్తం 12 రాశులపై ప్రభావం చూపనుంది. ఏ రాశివారిపై ఎలాంటి ప్రభావం చూపనుందో ఇప్పుడు తెలుసుకుందాం.
మేషం (Aries) - ఈ రాశి వారు మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఎవరితోనూ పరుషమైన మాటలు మాట్లాడకూడదు. వీరికి ఈ కాలంలో ఆర్థిక పురోగతి ఉంటుంది.
వృషభం (Taurus) - ఈ రాశి వారు తమ అందం పట్ల శ్రద్ధ చూపుతారు. కాస్మోటిక్స్ వస్తువులను ఎక్కువగా వాడతారు. వ్యక్తిత్వ వికాసం పెరుగుతుంది. అయితే మీరు పనిచేసే కంపెనీ పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించండి.
మిథునం (Gemini) - విదేశాలకు వెళ్లాలనుకునే వారు యాక్టివ్‌గా ఉండండి. మీరు డబ్బు ఖర్చు చేసి ఆనందించే సమయం ఇది. మీరు ఎక్కడికైనా విహారయాత్రకు వెళ్లాలని అనుకుంటే, తప్పకుండా వెళ్లండి. మీ కుటుంబం ఏదైనా దేవత వద్దకు వెళ్లాలని అనుకుంటే, మీరు వెళ్లవచ్చు.
కర్కాటకం (Cancer) - మీ ఆదాయం బాగా పెరుగుతుంది. స్త్రీలతో ఎలాంటి వివాదాలు పెట్టుకోవద్దు, మహిళా బాస్ లేదా సహోద్యోగితో ఎలాంటి గొడవలు పెట్టుకోవద్దు. మీరు మొబైల్ మార్చాలని ఆలోచిస్తుంటే, మీరు దానిని మార్చవచ్చు.
సింహం (Leo) - సోమరితనం పెరుగుతుంది. పనిలో కొత్త పద్ధతులు ఉపయోగిస్తారు. మీరు కొత్త సాంకేతికతలపై అవగాహన పెంచుకోవాలి. ఇది మీ పనిని సులభతరం చేస్తుంది.
కన్య (Virgo)- కన్యా రాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది. నిలిచిపోయిన పని పూర్తవుతుంది, ఈ కాలంలో ప్రమోషన్ కూడా రావచ్చు. మహిళా బాస్, తల్లి ద్వారా పురోగతి ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో వారితో ఎలాంటి వివాదాలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
తుల రాశి (Libra) - ఏ విషయమైనా లోతుగా వెళ్లి అర్థం చేసుకోండి మరియు వెంటనే సమాచారం పొందడం వల్ల ప్రయోజనం ఉండదు. ఫ్యూచర్ ప్లానింగ్ చేసుకోవచ్చు. మీరు భవిష్యత్తు కోసం కూడా పెట్టుబడి పెట్టవచ్చు. ఈ సమయంలో మీ ఆరోగ్యంపై కూడా ప్రత్యేక శ్రద్ధ వహించాలి.
వృశ్చికం (Scorpio)- ఈ రాశి వారు మంచి వ్యక్తులను కలుస్తారు, పాత మిత్రులను కూడా కలిస్తే బాగుంటుంది. కొత్త భాగస్వామ్యాలు కూడా ఏర్పడవచ్చు. పదోన్నతి పొందే అవకాశం కూడా ఉంది.
ధనుస్సు (Sagittarius) - పోటీకి సిద్ధమవుతున్న వ్యక్తులు ప్రయోజనం పొందుతారు. బ్యాంకింగ్, సీఏ, రెవెన్యూ శాఖల వారు మరింత కష్టపడాల్సి ఉంటుంది. ఉద్యోగార్థులు ప్రమోషన్‌తో పాటు బదిలీని అంగీకరించాలి.
మకరం (Capicron) - ఈ రాశి వారు తమ మనస్సును చురుకుగా ఉంచుతారు. మీ మనసులో ఎలాంటి మంచి ఆలోచనలు వచ్చినా వాటిని మీ డైరీలో రాసుకోండి. పిల్లల వైపు నుంచి కొన్ని శుభవార్తలు అందుతాయి.
కుంభం (Aquarius) - ఇంటి అందం, అలంకరణపై శ్రద్ధ వహించండి. ఏదైనా పని పెండింగ్‌లో ఉంటే పూర్తి చేయండి. మీరు ఎలక్ట్రానిక్ వస్తువులను కూడా కొనుగోలు చేయవచ్చు. మీ సామాజిక సర్కిల్ పెరుగుతుంది. ఉద్యోగార్ధులకు లేదా వ్యాపారులకు ఇది మంచి సమయం.
మీనం (Pisces) - ఈ రాశి వారికి ఈ మార్పు అనుకూలం కాదు. ప్రతిభ పెరుగుతుంది. మీలోని ప్రతిభను వెలికితీసే అవకాశం మీకు లభిస్తుంది. కంప్యూటర్, బ్యాంకింగ్, ఫ్యాషన్ డిజైనింగ్ తదితర రంగాల్లో పనిచేసేవారు తమ బృందంతో కలిసి పనిచేస్తే మంచి ఫలితాలు వస్తాయి. జీవిత భాగస్వామికి సంబంధించి కూడా విషయాలు సానుకూలంగా ఉంటాయి.
Also Read: Sun transit in Cancer: జూలై నెలలో ఆ మూడు రాశులకు పండగే పండగ, డబ్బుల వర్షం కురుస్తుందట
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook