Shukra Gochar 2023: 'ప్లానెట్ ఆఫ్ లవ్' అని శుక్రుడిని భావిస్తారు. ఆస్ట్రాలజీలో శుక్రుడిని శుభగ్రహంగా భావిస్తారు. మీ జన్మ చార్ట్‌లో శుక్రుడు శుభస్థానంలో ఉంటే వారికి దేనికీ లోటు ఉండదు. వేద జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, శుక్రుడు ఫిబ్రవరి 15న 19:43 నిమిషాలకు మీనరాశిలోకి ప్రవేశించనున్నాడు. శుక్రుడి మీనరాశి ప్రవేశం కొన్ని రాశులవారికి శుభప్రదంగా ఉండనుంది. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

శుక్రుడి సంచారం ఈ రాశులకు శుభప్రదం
మేషరాశి
రెండవ మరియు ఏడవ ఇంటికి అధిపతి అయిన శుక్రుడు మీ రాశి యెుక్క 12వ ఇంటిలో సంచరించనున్నాడు. శుక్రుడు మీ 12వ ఇంట్లోకి ప్రవేశించడంతో మీ ఖర్చులు పెరుగుతాయి. మీరు లగ్జరీ లైఫ్ ను లీడ్ చేస్తారు. ఉద్యోగంలో ప్రమోషన్ లభించే అవకాశం ఉంది. మీరు ఆర్థికంగా లాభపడతారు. మీ బిజినెస్ విస్తరిస్తుంది. కెరీర్‌లో ముందుకు వెళ్లేందుకు ఇదే మంచి సమయం. 
వృషభరాశి
వృషభ రాశి వారికి శుక్రుడు 1వ మరియు 6వ గృహాలకు అధిపతి కాగా ఇప్పుడు 11వ ఇంట్లో ఉచ్ఛస్థితిని పొందాడు. దీంతో మీ కోరికలన్నీ నెరవేరుతాయి. మీననరాశిలో శుక్రుడి సంచారం వల్ల మీ వ్యాపారం వృద్ధి చెందుతుంది. వృషభరాశి వారు మంచి లాభాలను గడిస్తారు. జాబ్ మారడానికి ఇదే మంచి సమయం.


మిథునం
శుక్రుడు మిథునరాశి వారికి 5వ మరియు 12వ గృహాలకు అధిపతి మరియు కెరీర్‌లోని 10వ ఇంట్లో శుక్రుడు ఉన్నతమైన మీన రాశిలో సంచరించనున్నాడు. ఈ సమయంలో మీ కెరీర్ అద్భుతంగా ఉంటుంది. మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీకు త్వరలో మంచి రోజులు మెుదలుకానున్నాయి. సృజనాత్మక వృత్తులతో సంబంధం ఉన్నవారికి ఈ సమయం బాగుంటుంది. 
కర్కాటకం
4వ మరియు 11వ గృహాలకు అధిపతి అయిన శుక్రుడు 9వ ఇంట్లో సంచరిస్తాడు. కర్కాటక రాశివారికి పదోన్నతి లభించే అవకాశం ఉంది. మీరు ఆర్థికంగా లాభపడతారు. మీ పనికి ప్రతిఫలం లభిస్తుంది. మీ జీతాలు పెరుగుతాయి. ఉద్యోగం నిమిత్తం ప్రయోజనం పొందే అవకాశం ఉంది. 


Also Read: Budh Mahadasha: మీ జాతకంలో బుధ మహాదశ ఉందా? అయితే మీ లైఫ్ కింగ్ లా ఉంటుంది.. 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu  


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook