Shukra Asta September 2022 Effects on Zodiacs: ఇవాళ అంటే సెప్టెంబరు 15, 2022 రాత్రి 02:29కి శుక్ర గ్రహం సింహరాశిలో (Shukra Asta September 2022) అస్తమిస్తుంది. డిసెంబర్ 2, 2022 వరకు వీనస్ గ్రహం క్రియారహిత స్థితిలోనే ఉంటుంది. జ్యోతిషశాస్త్రంలో శుక్రుడిని శుభ గ్రహంగా భావిస్తారు. ఎందుకంటే శుక్రుడు జీవితంలో ఆనందం, అందం, గౌరవం, ప్రేమ, శృంగారాన్ని ఇస్తుంది. ఆస్ట్రాలజీ ప్రకారం, ఏ గ్రహం అస్తమించడం మంచిది కానప్పటికీ, కొన్నిసార్లు అవి కూడా శుభ ఫలితాలను ఇస్తాయి. శుక్రుడు అస్తమించడం వల్ల ఏ రాశుల వారికి మేలు జరుగుతుందో తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మేషం (Aries)- శుక్రుడు అస్తమించడం వల్ల ఈ రాశివారికి కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. కానీ వీరి లైఫ్ లో ఆనందం వెల్లివిరుస్తుంది. ఇంట్లో ఆనందం మరియు శాంతి ఉంటుంది. 
వృషభం (Taurus)- వృషభ రాశికి అధిపతి శుక్రుడు. వీనస్ ఈ రాశివారికి ప్రేమను ఇస్తుంది. దీంతో మీ భాగస్వామితో బంధం బలంగా ఉంటుంది. ఈ సమయంలో కుటుంబ సమేతంగా విహారయాత్రకు వెళ్లే అవకాశం ఉంది. 
మిథునం (Gemini)- విలాసవంతమైన వస్తువులను కొనుగోలు చేయడానికి ఖర్చు చేస్తారు. ప్రేమ జీవితం అద్భుతంగా ఉంటుంది. డబ్బు అందుతుంది. 
కన్య (Virgo)- కొత్త వ్యక్తులతో పరిచయం ఏర్పడుతుంది. మీ వ్యక్తిత్వం యొక్క ఆకర్షణ ప్రజలపై చెరగని ముద్ర వేస్తుంది. పెళ్లికాని వారు వివాహం చేసుకునే అవకాశం ఉంది. లగ్జరీ లైఫ్ గడుపుతారు. 
తుల (Libra)- తులారాశిని పాలించే గ్రహం కూడా శుక్రుడు. ఈ సమయం మీకు వరం లాంటిది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. మీరు ప్రశంసించబడతారు. సౌకర్యాలు పెరుగుతాయి. పెద్ద కంపెనీలో జాబ్ రావచ్చు.  ఆదాయం పెరుగుతుంది.
వృశ్చికం (Scorpio)- జీవితంలో సౌకర్యాలు పెరుగుతాయి. సంపద పెరుగుతుంది. మీ భాగస్వామి అభిప్రాయాన్ని తీసుకున్న తర్వాత నిర్ణయాలు తీసుకుంటే మీకు మేలు జరుగుతుంది. 
మకరం (Capricorn) - ఇది మీకు చాలా మంచి సమయం. సంబంధాలు మెరుగుపడతాయి. ధనం లాభదాయకంగా ఉంటుంది. జీవితంలో సుఖ సంతోషాలు పెరుగుతాయి.
మీనం (Pisces)- ఈ రాశివారి జీవితం సాఫీగా గడిచిపోతుంది. ప్రేమ జీవితం చాలా బాగుంటుంది. మీ బంధం మునుపటి కంటే ఎక్కువగా బలపడుతుంది. 


Also Read: Guru Vakri 2022: మీనంలో తిరోగమనం చేయనున్న గురుడు.. ఈ 3 రాశుల వారికి ఊహించని ధనం!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook