Venus Transit 2023 on 6th April 2023: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, గ్రహాల కదలికలు కాలానుగుణంగా రాజయోగాన్ని సృష్టిస్తాయి.  ఏప్రిల్ 06న ఐశ్వర్యాన్ని ఇచ్చే శుక్రుడు తన రాశిని మార్చనున్నాడు. ప్రస్తుతం మేషరాశిలో సంచరిస్తున్న శుక్రుడు రేపు వృషభరాశిలోకి (Venus Transit in Taurus 2023) ప్రవేశించబోతున్నాడు. శుక్రుడు తన స్వంత రాశిలో సంచరించడం వల్ల మాళవ్య రాజయోగం ఏర్పడుతోంది. ఆస్ట్రాలజీలో ఈ యోగాన్ని చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. మాళవ్య యోగం ఏ రాశుల వారికి మేలు చేస్తుందో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మాళవ్య యోగం ఈ రాశులకు వరం


వృషభం
ఈ రాశి యెుక్క లగ్న గృహంలో శుక్రుడు సంచరించబోతున్నాడు. దీంతో మీకు అదృష్టం కలిసి వ్చి ప్రతి పనిలో విజయం సాధిస్తారు. మీ కష్టానికి తగిన ప్రతిఫలం దక్కుతుంది. మీరు లగ్జరీ లైఫ్ ను లీడ్ చేస్తారు. వైవాహిక జీవితం బాగుంటుంది. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మీకు పెళ్లి ఫిక్స్ అయ్యే ఛాన్స్ ఉంది. వ్యాపారులు భారీగా లాభపడతారు. 


సింహరాశి 
సింహరాశి వారికి ఈ సమయం కలిసి వస్తుంది. మాలవ్య రాజయోగం ఈ రాశి యెుక్క పదో ఇంట్లో  ఏర్పడబోతుంది. ఉద్యోగం సాధించాలనే మీ కోరిక నెరవేరుతుంది. వ్యాపారస్తులు అధికక లాభాలను గడిస్తారు. జీతంతోపాటు మీకు సౌకర్యాలు పెరుగుతాయి. మీరు ఆస్తి లేదా వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది. కొత్త పనులు ప్రారంభించడానికి ఇదే అనుకూల సమయం. 


Also Read: Surya Budh Yuti 2023: బుధాదిత్య యోగంతో ఈ 3 రాశులకు అన్నీ మంచి రోజులే.. ఇందులో మీరున్నారా?


కుంభ రాశి
మాళవ్య రాజ్యయోగం నాల్గవ రాశిలో ఏర్పడబోతుంది. వాహనం కొనుగోలుకు ఇదే అనుకూల సమయం. మీరు ఇల్లు, ఫ్లాట్, ఫర్నీచర్ మొదలైనవాటిని కొనుగోలు చేసే అవకాశం ఉంది. మీరు కుటుంబ సభ్యులతో గడిపే అవకాశం ఉంది. మెుత్తానికి ఈ సమయం మీకు కలిసి వస్తుంది. 


Also Read: Lunar Eclipse 2023: తొలి చంద్ర గ్రహణం ప్రభావం, ఆ 3 రాశులకు మహర్దశే, ఊహించని డబ్బు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి  TwitterFacebook