Budhaditya Yoga in Mesh Rashi on 14th april 2023: జ్యోతిషశాస్త్రంలో గ్రహాల కదలికకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ఈనెల 14, శుక్రవారం నాడు సూర్యదేవుడు మేషరాశిలోకి ఎంటర్ అవ్వనున్నాడు. దీనినే మేష సంక్రాంతి అంటారు. ఏప్రిల్ 14న సూర్యుడు, బుధ గ్రహాల కలయిక వల్ల బుధాదిత్య యోగం ఏర్పడుతుంది. సూర్యుడు మరియు బుధుడు సంయోగం కొన్ని రాశులవారు ప్రయోజనం పొందనున్నారు. ఆ రాశులేంటో తెలుసుకుందాం.
సింహరాశి
సూర్యుడు మరియు బుధుడు కలయికతో ఏర్పడిన బుధాదిత్య యోగం సింహరాశి వారిపై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. మీ ఆదాయం రెట్టింపు అవుతుంది. ఉద్యోగులు ప్రమోషన్ పొందే అవకాశం ఉంది. కోర్టు కేసుల్లో మీరు విజయం సాధిస్తారు. వ్యాపారులు మంచి ప్రయోజనాలు పొందుతారు.
కర్కాటక రాశి
బుధాదిత్య యోగం కర్కాటక రాశి వారికి మేలు చేస్తుంది. మీలో దైర్యసాహసాలు పెరుగుతాయి. సోదరసోదరీమణుల సహకారం లభిస్తుంది. వ్యాపారులు విజయం సాధిస్తారు. ఉద్యోగులు మంచి పురోగతి పొందుతారు. ఆఫీసులో సహోద్యోగులతో సంబంధాలు మెరుగ్గా ఉంటాయి. ఆర్థికంగా మీరు మునుపటి కంటే బలపడతారు.
Also Read: Guru Uday 2023: మేష రాశిలో ఉదయించబోతున్న బృహస్పతి.. ఈ 4 రాశుల ఇంటిపై డబ్బు వర్షం..
మేషరాశి
మేష రాశి వారికి బుధాదిత్య యోగం శుభప్రదం కానుంది. మీకు సంతానప్రాప్తి కలుగుతుంది. పోటీపరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు విజయం సాధిస్తారు. మీకు పెళ్లి ఫిక్స్ అయ్యే అవకాశం ఉంది. మీ ఆదాయం రెట్టింపు అవుతుంది. మీ కోరికలన్నీ నెరవేరుతాయి.
Also Read: Grah Gochar 2023: ఏప్రిల్‌లో కీలక గ్రహ సంచారాలు..ఈ 5 రాశుల వారి జీవితాల్లో కల్లోలం..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook