Vijayadashami 2020: sri rajarajeswari devi avatharam: న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా దసరా (విజయదశమి) సంబురాలు ఘనంగా జరుగుతున్నాయి. తొమ్మిది రోజుల నుంచి అత్యంత వైభవంగా ప్రకాశవంతంగా జరిగిన దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు (Navratri 2020) నేటితో ముగియనున్నాయి. ఆలయాల్లో, పందిళ్లల్లో కొలువైయున్న శ్రీ కనకదుర్గా దేవి (kanakadurga devi) అమ్మవారు రోజుకొక అవతారంలో భక్తులకు దర్శనమిస్తూ నిత్య పూజలు అందుకుంది. ఈ నవరాత్రుల్లో భక్తులు నిత్య ఉపావాసాలుంటూ.. అమ్మవారి అనుగ్రహం కోసం నిష్టగా పూజలు చేస్తున్నారు. అయితే దేవినవరాత్రుల్లో భాగంగా చివరిరోజు.. దసరా (విజయదశమి) పర్వదినం ఆదివారం ఆశ్వీయుజ శుద్ధ దశమినాడు (Navratri last Day ) శ్రీ కనకదుర్గా దేవీ సాక్షాత్తూ సిద్ధిధాత్రి (siddhidatri mata) శాక్తేయానుసారముగా శ్రీ రాజరాజేశ్వరి దేవి ( Sri Rajarajeshwari Devi) (దసరా ప్రధానంగా) గా దర్శనమివ్వనుంది. శరన్నవరాత్రి ఉత్సవాల్లో చివరిరోజు విజయదశమి (Vijayadashami) (దసరా) పర్వదినం నాడు అమ్మవారు చివరి రూపం శ్రీ రాజరాజేశ్వరీ దేవిగా విరాజిల్లనుంది కావున భక్తులు విశేష పూజలు చేసి అమ్మవారి కరుణ, కటాక్షాలను పొందనున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

[[{"fid":"195774","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"శ్రీ రాజ రాజేశ్వరీ దేవి","field_file_image_title_text[und][0][value]":"శ్రీ రాజరాజేశ్వరి దేవి అవతారంలో అమ్మవారు"},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"శ్రీ రాజ రాజేశ్వరీ దేవి","field_file_image_title_text[und][0][value]":"శ్రీ రాజరాజేశ్వరి దేవి అవతారంలో అమ్మవారు"}},"link_text":false,"attributes":{"alt":"శ్రీ రాజ రాజేశ్వరీ దేవి","title":"శ్రీ రాజరాజేశ్వరి దేవి అవతారంలో అమ్మవారు","class":"media-element file-default","data-delta":"1"}}]]


శ్రీ రాజరాజేశ్వరి దేవి విశిష్టత..
సకల భువన బ్రహ్మాండాలకు శ్రీ రాజరాజేశ్వరి దేవి ఆరాధ్యదేవత. కావున మహాత్రిపుర సుందరిగా ఈ దేవత త్రిపురాత్రయంలో పూజలందుకుంటూ అపరాజితాదేవిగా విరాజిల్లుతుంది. పరమేశ్వరుడి అంకం ఆసనంగా.. ఇచ్ఛా, జ్ఞాన, క్రియా శక్తులను శ్రీ రాజరాజేశ్వరి దేవి భక్తులకు అనుగ్రహిస్తుంది. యోగామూర్తిగా.. మాయామోహిత మానవ చైతన్యాన్ని ఉద్దీపనం చేస్తూ అనంత శక్తి స్వరూపిణిగా దర్శనమిస్తుంది. బంగారం రంగు చీర ధరించి అమ్మవారు చతుర్భుజాలతో.. ఒక చేతిలో చెరకుగడ, ఇంకో చేతిలో అభయముద్రలతో.. దురహ౦కారులను, శిక్షి౦చుటకు అ౦కుశ౦, పాశ౦ ధరి౦చి భక్తులను అనుగ్రహిస్తుంది. ఈ సందర్భంగా శ్రీ రాజరాజేశ్వరి దేవి స్వప్రకాశ జ్యోతి స్వరూపిణిగా కోటి సూర్య సమప్రభగా విరాజల్లుతుంది. కావున భక్తులతోపాటు రుషులు, మునులు, సిద్ధులు కూడా సిద్ధిధాత్రిని పూజించి అమ్మవారి కరుణ కటాక్షాలను పొందుతారు. ఈ సందర్భంగా శ్రీ రాజరాజశ్వరి దేవికి  పాయసం, పరమాన్నం, లడ్డూలు నైవేద్యంగా సమర్పించి భక్తులు విశేష పూజలు చేస్తారు. Also read: 
Dussehra 2020: శమీ పూజ.. పాలపిట్ట దర్శనం ప్రాముఖ్యత గురించి మీకు తెలుసా..?


రాజరాజేశ్వరీ దేవి అనుగ్రహానికి ఈ శ్లోకాన్ని పఠించండి..
‘‘ అంబారౌద్రిణి భద్రకాళి బగళా 
జ్వాలాముఖీవైష్ణవీ బ్రహ్మాణీత్రిపురాంతకీ 
సురనుతాదేదీప్యమానోజ్జ్వలాచాముండాశ్రిత
రక్షపోషజననీ దాక్షాయణీ పల్లవి చిద్రూపి 
పరదేవతా భగవతీ శ్రీరాజరాజేశ్వరీ ’’


ఇదిలాఉంటే.. తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా దసరా (Dussehra) మహోత్సవాలు అత్యంత వైభవంగా.. ఘనంగా జరుతున్నాయి. నేటితో దేవి శరన్ననవరాత్రులు వైభవంగా ముగియనున్నాయి. దేవి నవరాత్రులు చివరిరోజు.. విజయదశమి పర్వదినాన శ్రీ కనకదుర్గా దేవి భక్తులకు సాక్షాత్తూ.. శ్రీ రాజరాజేశ్వరి దేవీగా దర్శనమివ్వనుంది. దసరా పర్వదినం కావున విజయవాడ ఇంద్రకీలాద్రీపై వెలసిఉన్న శ్రీ కనక దుర్గమ్మను దర్శించుకోవడానికి ఉదయం నుంచే భక్తులు బారులు తీరారు. దీంతోపాటు ఇరు రాష్ట్రాల్లోని వారి వారి ప్రాంతాల్లో ఉన్న ఆలయాలకు చేరుకొని అమ్మవారి కరుణా కటాక్ష వీక్షణాల కోసం వేచిచూస్తున్నారు. ALSO READ|  Bhagavad Gita Lessons:  కురుక్షేత్రంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పిన 10 జీవిత సత్యాలు