Vijayadashami 2022: విజయదశమి పండగను ఎందుకు జరుపుకుంటారో తెలుసా.. ఇంతకి విభీషణుడు ఏం చెప్పాడు..?
Vijayadashami 2022: విజయదశమి పండగను జరుపుకోవడానికి చాలా రకాల కారణాలు ఉన్నాయి. పురాణాలు చెబుతున్న ప్రకారం.. రావణుని ఉచ్చులో నుంచి సీతమ్మను రక్షించేందుకు శ్రీరాముడు లంకకు బయలుదేరుతాడు. రావణడి శ్రీ రాముడికి మధ్య యుద్ధం జరుగుతుంది..
Vijayadashami 2022: విజయదశమి పండగను జరుపుకోవడానికి చాలా రకాల కారణాలు ఉన్నాయి. పురాణాలు చెబుతున్న ప్రకారం.. రావణుని ఉచ్చులో నుంచి సీతమ్మను రక్షించేందుకు శ్రీరాముడు లంకకు బయలుదేరుతాడు. ఈ క్రమంలో అశ్విని మాసం తృతీయ తిథి నుంచి శ్రీరాముడికి రావణునికి మధ్య యుద్ధం జరుగుతుంది ఈ యుద్ధం శుక్లపక్షం పదవ రోజు వరకు కొనసాగుతుంది. అయితే ఈ పదవ రోజున శ్రీరాముడు లంక అధిపతైన రావణున్ని తన విల్లు సహాయంతో సంహరిస్తాడని ప్రచారం.. కానీ శ్రీరాముడు రావణుని విల్లుతోనే రావణ సంహారం చేస్తాడని పురాణాలు చెబుతున్నాయి. ఈ తీవ్ర యుద్ధంలో చివరికి శ్రీరాముడు విజయం సాధిస్తాడు. దీంతో ప్రజలంతా చెడుపై సాధించిన విజయానికి గాను విజయదశమి వేడుకలను జరుపుకుంటారు.
విభీషణుడు చెప్పిన ప్రకారం:
రావణుడు చాలా జ్ఞానవంతుడు అంతేకాకుండా శక్తివంతుడు కూడా.. అతని సంహారానికి శ్రీరాముడు చాలా కష్టపడ్డాడని విభీషణులు తెలిపాడు. దేవతలు ఇచ్చిన అనుగ్రహం వల్ల రావణున్ని సంహారం చేయడం చాలా కష్టం. అయినప్పటికీ శ్రీరాముడు తన విల్లుతో రావణున్ని ఓడించగలిగాడు. వారిద్దరి మధ్య దాదాపు 10 రోజలుకుపైగా యుద్ధం కొనసాగిందని ఆయన పేర్కొన్నారు. ఈ యుద్ధంలో భాగంగా శ్రీరాముడు విజయం రావణుడిపై విజయం సాధిస్తాడు.
యుద్ధంలో శ్రీరాముడు ఎలాంటి ధనస్సులను వినియోగించాడు..?:
శ్రీరాముడు రావణునికి మధ్య జరిగిన యుద్ధంలో రెండు రకాల విల్లులను వినియోగించారని శాస్త్రాలు చెబుతున్నాయి. శ్రీరామునికి తన తండ్రి ప్రసాదించిన వెదురుతో చేసిన విల్లును ఆ యుద్ధంలో ఉపయోగించగా.. రావణుడు దివ్యాస్త్రన్ని వినియోగించారట. ఈ అస్త్రాన్ని రావణునికి బ్రాహ్మణులు ఎంతో పూజలు చేసి ఇచ్చారని ప్రచారం.. అశ్విని మాసంలోని చివరి రోజున జరిగిన యుద్ధంలో రావణున్ని శ్రీరాముడు సంహరించాడు. దీంతో యుద్ధము ముగిసి సీతాదేవి శ్రీరాముని చెంతకు చేరుతుంది. దీంతో ప్రజలందరూ విజయోత్సవాలు జరుపుకుంటారు.
Also Read: Dussehra 2022: దసరా రోజు ఆయుధ పూజలో భాగంగా ఇలా చేయండి.. మీరు కోరిన కోరికలు తీరుతాయి..
Also Read: Dussehra 2022: శ్రీ రాజరాజేశ్వరిదేవిగా అమ్మవారు.. దర్శనానికి పోటెత్తుతున్న భక్తులు..
Also Read: Allu Arjun - Ram Charan : రా రా.. రా పక్కన కూర్చోరా!.. వీడియో వైరల్
Also Read: Godfather Twitter Review : గాడ్ ఫాదర్ ట్విటర్ట్ రివ్యూ.. అదే పెద్ద మైనస్ అంటున్నారే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook