Vijayawada Dasara Navaratri Celebrtions: విజయవాడ ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాలు ఎంతో వైభవోపేతంగా జరుగుతున్నాయి.  ఈ రోజు  ఉత్సవాల్లో భాగంగా ఐదో రోజు మహాచండిగా భక్తులకు అమ్మవారు దర్శమిస్తున్నారు. చండీదేవిని రెండు విధాలుగా కొలుస్తారు. చండీ ప్రశాంత వదనంతో ఉన్నప్పుడు ఉమా, గౌరీ, పార్వతి, హైమవతి, శతాక్షి, జగన్మాత, భవానిగా పిలుస్తారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అదే చండీ కోపంగా  భయంకరమైన రూపంలో ఉన్నప్పుడు దుర్గ, కాళి , శ్యామ, చండీ, చండిక, భైరవి పేర్లతో అమ్మవారిని  పూజిస్తారు. దసరా నవరాత్రుల సందర్బంగా మహాచండి అలంకారంలో ఉన్న శక్తి స్వరూపాన్ని దర్శించుకుంటే మనసులో ఉండే కోర్కెలు నెరవేరుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి.  ఈ శక్తి రూపాన్ని దర్శించుకుంటే కోరిన కోర్కెలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. ఈ క్రమంలోనే ఇవాళ శరన్నవరాత్రుల్లో చండీ హోమం నిర్వహిస్తారు. ఈ హోమంలో పాల్గొనడానికి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు. మొత్తంగా అమ్మవారి దర్శనానికి రాష్ట్రంతో పాటు దేశం నలుమూలల నుండి భక్తులు అమ్మవారికి దర్శనానికి పోటెత్తుతున్నారు.  


ఇదీ చదవండి: Devara Villain Saif: దేవర విలన్ బైరాకు వైయస్ఆర్ ఫ్యామిలీకి ఉన్న ఈ రిలేషన్ తెలుసా..


ఇదీ చదవండి: Pawan Kalyan Second Daughter: పవన్ కళ్యాణ్ చిన్న కూతురును చూశారా.. ఎంత క్యూట్ గా ఉందో..!


నవరాత్రులు భాగంగా మరో నాలుగు రోజులు మాత్రమే మిగిలి ఉంది. దసరా అమ్మవారిని కృష్ణానదిలో ఊరేగిస్తారు. దీంతో దసరా నవరాత్రి ఉత్సవాలు ముగుస్తాయి. మరోవైపు దేశ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో అమ్మవారిని వివిధ రూపాల్లో కొలుస్తున్నారు. మరోవైపు శ్రీశైల భ్రమరాంబిక ఆలయంలో అమ్మవారి దసరా నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరగుతున్నాయి. తెలంగాణలోని ఆలంపూర్ జగులాంబ జిల్లాలో కొలువైన అమ్మవారి దేవాలయంలో దసరా నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. కర్నూలు, మహబూబ్ నగర్ జిల్లాలతో పాటు కర్ణాటకకు చెందిన భక్తులు అమ్మవారిని దర్శించుకుంటున్నారు. మొత్తంగా నవరాత్రుల్లో అమ్మవారిని కొలిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. మరోవైపు విజయవాడలో దసరా నవరాత్రుల సందర్భంగా భవానీ దీక్ష చేపడుతుంటారు. దసరా రోజున కానీ ఆ తర్వాత రోజులు భక్తులు భవానీ దీక్షను విరమిస్తారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేసారు.


ఇదీ చదవండి:  Tollywood Celebrities Guinnis Records: చిరంజీవి కంటే ముందు గిన్నీస్ బుక్ లోకి ఎక్కిన తెలుగు చిత్ర ప్రముఖులు వీళ్లే..


ఇదీ చదవండి:  Highest-paid villains: సైఫ్, బాబీ దేవోల్ సహా మన దేశంలో ఎక్కువ రెమ్యునరేష్ తీసుకుంటున్న క్రేజీ విలన్స్ వీళ్లే..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebookTwitter