Vijayawada Dasara Celebrtions: విజయవాడలో వైభవంగా దసరా నవరాత్రి ఉత్సవాలు..
Vijayawada Dasara Celebrtions: విజయవాడలో ఇంద్రకీలాద్రిపై వెలసిన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయంలో దసరా ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. శరన్నవరాత్రి ఉత్సవాల్లో నాలుగో రోజు లలితా త్రిపుర సుందరీ దేవిగా దుర్గమ్మగా దర్శమిస్తున్నారు.
Vijayawada Dasara Celebrtions: బెజవాడలో ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గా మల్లేశ్వర కనన స్వామి ఆలయంలో దసరా నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభోవేపతంగా జరుగుతున్నాయి. దసరా ఉత్సవాల్లో భాగంగా ఈ రోజు అమ్మవారు శ్రీ లలితా త్రిపుర సుందరి దేవీగా భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఈరోజు లలితా అమ్మవారిగా దర్శనం చేసుకున్న భక్తులకు ఆయు: ఆరోగ్య ఐశ్వర్యాలను ప్రసాదిస్తారట.మరోవైపు ఈ రోజు ఆదివారం కావడంతో తెల్లవారుఝాము నుంచే భక్తులు అమ్మవారి దర్శనానికి పోటెత్తారు. క్యూ లైన్లు నిండిపోయాయి.
శరన్నవరాత్రి ఉత్సవాల్లో నాల్గవ రోజు అమ్మవారు శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవిగా దుర్గమ్మ దర్శనమిస్తున్నారు. కుడివైపున లక్ష్మీదేవి, ఎడమ వైపున సరస్వతీదేవి సేవలు చేస్తుండగా చెఱకుగడ, విల్లు, పాశాంకుశాలను ధరించి ఎరుపు, నీలం రంగు చీరలో ఓంకార రూపిణి అయిన అమ్మవారు భక్తులను అనుగ్రహిస్తున్నారు.
ఇదీ చదవండి: Devara Villain Saif: దేవర విలన్ బైరాకు వైయస్ఆర్ ఫ్యామిలీకి ఉన్న ఈ రిలేషన్ తెలుసా..
ఇదీ చదవండి: Pawan Kalyan Second Daughter: పవన్ కళ్యాణ్ చిన్న కూతురును చూశారా.. ఎంత క్యూట్ గా ఉందో..!
ఈ రోజున అమ్మవారికి రాజభోగం పేరుతో పాయసాన్నం, చక్రాన్నం, పూర్ణాలు, అల్లం గారెలు ఇలా పది రకాలను నైవేద్యాలుగా సమర్పిస్తారు. ఈ రూపంలో అమ్మవారిని దర్శించుకుంటే.. ఎన్నో ఏళ్లుగా అనుభవిస్తున్న బాధలు తీరడంతో పాటు మనసులో ఉన్న మంచి కోరికలు నెరవేరుతాయనేది భక్తుల విశ్వాసం. దీంతో ఉదయం నుంచి భక్తులు భారీగా తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. మొదటి మూడు రోజుల్లోనే 2 లక్షల మందికిపైగా అమ్మవారిని దర్శించుకుంటున్నట్టు అధికారులు తెలిపారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.