Vinayak Chaturthi 2022: పంచాంగం ప్రకారం, ప్రతి నెల శుక్షపక్ష చతుర్థి నాడు వినాయక చతుర్థి జరుపుకుంటారు. మార్గశిర మాసంలో వచ్చే ఈ పండుగకు చాలా విశిష్టత ఉంది. ఈసారి వినాయక చతుర్థి నవంబరు 27న వస్తుంది. ఈరోజు ఉపవాసం ఉండి గణేశుడిని (Lord Ganesh) పూజించడం వల్ల మీకు జీవితంలో దేనికీ లోటు ఉండదు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వినాయక చతుర్థి ముహూర్తం


చతుర్థి తిథి నవంబర్ 26 రాత్రి 7.28 నుండి నవంబర్ 27 సాయంత్రం 4.25 వరకు ఉంటుంది. నవంబర్ 27న ఉదయం 11:11 నుండి మధ్యాహ్నం 1:00 గంటల వరకు  పూజ చేసుకోవడానికి అనుకూలమైన సమయం. ఈరోజున గణేశుడిని పూజించడం వల్ల మీరు కష్టాల నుండి విముక్తి పొందుతారు. అంతేకాకుండా మీరు ఆర్థికంగా లాభపడతారు. డిసెంబర్‌లో వినాయక చతుర్థి తిథి డిసెంబర్ 26న సాయంత్రం 4:51 గంటలకు ప్రారంభమై డిసెంబర్ 27న తెల్లవారుజామున 1:37 గంటలకు ముగుస్తుంది.


వినాయక చతుర్థి పూజా విధానం


వినాయక చతుర్థి రోజున ఉపవాసం పాటించండి. ముందుగా సూర్యోదయానికి ముందే స్నానం చేసి మంచి బట్టలు ధరించాలి. పూజా స్థలాన్ని శుభ్రం చేసి గంగాజలంతో శుద్ధి చేయండి. వినాయకుడిని పూలతో, దీపాలతో, గంగాజలంతో పూజించండి. అనంతరం గణేశుడికి హారతి ఇవ్వండి. పూజానంతరం ఉపవాసాన్ని విరమించండి. వినాయక చతుర్థి నాడు చంద్రుడిని చూడకూడదనే నియమం కూడా ఉంది.


Also Read: Guru Margi 2022: మీన రాశిలోకి బృహస్పతి గ్రహం ఈ రాశువారి అన్ని నష్టాలే.. ఎందుకో తెలుసా..? 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి