Saturn-Moon Conjunction Forms Vish Yoga: ప్రతి గ్రహం ఎదో ఒక క్రమంలో 12 రాశిచక్రాలపై సానుకూల లేదా ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. ఈ ప్రక్రియకు జ్యోతిష్య శాస్త్రంలో మంచి ప్రాముఖ్య ఉంది. ఈ గ్రహ ప్రభావాలు పలు రాశులవారిపై మంచి ప్రభావాన్ని చూపుతే మరికొన్ని రాశులవారికి తీవ్ర దుష్ప్రభాలు కలిగించవచ్చని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. మే 13న శని, చంద్ర గ్రహాలు ఒకే రాశిలో కలవబోతున్నాయి. ఈ కలయిక చాలా ప్రమాదమని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ గ్రహాల కలయిక వల్ల చాలా రాశులవారు తీవ్ర సమస్యల బారిన పడతారని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి ఈ రాశులవారు అప్రమత్తంగా ఉండాలో తెలుసుకోండి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ రాశులవారిపై ప్రభావం:
కర్కాటకరాశి:

కర్కాటక రాశి వారికి ఎనిమిదవ స్థానంలో ఈ ప్రతికూల యోగం ఏర్పడబోతోంది. కాబట్టి ఈ రాశివారికి  విపత్కర పరిస్థితిని రావొచ్చని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా ఈ క్రమంలో ఆర్థికంగా కూడా దెబ్బతింటారు.. కాబట్టి ఆర్థికంగా పలు రకాల జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిది. ఏవైన కొత్త వస్తువులను ఇప్పుడు కొనుగోలు చేయకపోవడం చాలా మంచిది. అంతేకాకుండా ఈ క్రమంలో తీవ్ర అనారోగ్య సమస్యలు కూడా రావొచ్చు. డ్రైవింగ్ చేసేటప్పుడు లేదా డబ్బు పెట్టుబడి పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. లేకపోతే తీవ్ర సమస్యలు రావొచ్చని నిపుణులు చెబుతున్నారు. 


Also Read:  HBD Sai Pallavi : నీ చెల్లిగా పుట్టినందుకు నేను లక్కీ.. మిస్ అవుతున్నా.. సాయి పల్లవి సిస్టర్ స్పెషల్‌ విషెస్


కన్యారాశి: 
ఈ యోగం కన్యారాశి వారికి ఆరవ స్థానంలో ఏర్పడబోతోంది. కాబట్టి పలు రాశులవారితో ఈ రాశివారికి కూడా పెద్ద సవాలుగా మారొచ్చు. మీ శత్రువులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ఛాన్స్‌ కూడా ఉంది. కాబట్టి ఈ క్రమంలో తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ఆర్థిక సంక్షోభం కూడా రావొచ్చు. అంతేకాకుండా మీ కార్యాలయంలో జాగ్రత్తగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా ఖర్చులు పెరిగి ఆదాయం కూడా పెరుగుతుంది. 


మీన రాశి: 
జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం..ఈ రాశివారికి పన్నెండవ స్థానంలో ఈ యోగం ఏర్పడబోతోంది. కాబట్టి తీవ్ర దుష్ప్రభాలు కలిగే అవకాశాలు కూడా ఉన్నాయని నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా తీవ్ర అనారోగ్య సమస్యలు కూడా వస్తాయి. కాబట్టి పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. ముఖ్యంగా తల్లిదండ్రులకు కూడా అనారోగ్య సమస్యలు వస్తాయి. కాబట్టి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. 


Also Read:  HBD Sai Pallavi : నీ చెల్లిగా పుట్టినందుకు నేను లక్కీ.. మిస్ అవుతున్నా.. సాయి పల్లవి సిస్టర్ స్పెషల్‌ విషెస్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook