Wednesday Remedy : హిందూ మతంలో అనేక మత గ్రంథాలు విశ్లేషించబడ్డాయి. జ్యోతిషశాస్త్రం యొక్క ప్రధాన పుస్తకం, లాల్ కితాబ్(ఎర్ర పుస్తకం)లో జీవితంలోని ఇబ్బందుల నుండి బయటపడటానికి అనేక నివారణల గురించి చెప్పబడింది. ఈ పుస్తకంలో ప్రతి రోజుతోపాటు గ్రహ స్థితిని అనుసరించి కొన్ని నివారణలు వివరించబడ్డాయి. వాటిని అనుసరించటం ద్వారా జీవితంలో సుఖ సంతోషాలు, సమృద్ధి, సౌభాగ్యం, అదృష్ట ప్రాప్తి కలుగుతుంది. హిందూమతంలో, బుధవారం ఆదిపూజ్యుడైన శ్రీ గణేశుడికి అంకితం చేయబడింది. ఈ రోజున, జ్యోతిష ఆది గ్రంథంలో చెప్పబడిన నివారణోపాయాలు అనుసరించడం ద్వారా, జీవితంలో సానుకూల శక్తి ప్రసరితమవుతుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బుధవారం నివారణోపాయాలు :


జాతకంలో బుధ గ్రహం యొక్క బలహీన స్థితి ద్వారా గానీ, మహార్దశ కారణంగా గానీ, వ్యక్తి యొక్క వాక్ సామర్థ్యం బలహీనపడటం ప్రారంభమవుతుంది. గృహ సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు మొదలైన సమస్యలు చుట్టుముడతాయి. పుస్తకంలో చెప్పిన ప్రకారం, గణేశుడిని వరుసగా 24 బుధవారాలు పూజించడం వల్ల సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది.


బుధగ్రహం బలహీనంగా ఉన్నప్పుడు దంతాలు, కడుపు సంబంధిత సమస్యలు, అప్పులు పెరగడం, అగౌరవం వంటి సమస్యలు చుట్టుముడతాయి. బుధవారం నాడు ఉడికించిన పెసలు పంచడం శుభప్రదమని ఈ పుస్తకం చెప్తోంది.


-బుధవారం నాడు తులసి మొక్క చుట్టూ రాలిన ఆకును ఏరుకుని కడిగి తినడం శుభప్రదం.


-మీరు జీవితంలో గణేశుడి అనుగ్రహం పొందాలంటే, బుధవారం నాడు 9 మంది కన్యలకు భోజనం చేయించండి. అలాగే ఆకుపచ్చ రంగు రుమాలు పంచడం వల్ల జాతకంలో బుధ గ్రహం బలపడుతుంది.


లాల్ కితాబ్‌(జోతిష ఆది గ్రంథం)లో పేర్కొన్న పరిహారం ప్రకారం, ఒకేసారి 100 ఆవులకు ఆహారం పెట్టడం చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. ఇలా చేయడం వల్ల జీవితంలో సానుకూలత పెంపొందుతుంది.


( గమనిక : ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు, సమాచారం ఆధారంగా ఉంటుంది. ZEE NEWS దానిని నిర్ధారించలేదు. )


Also Read - Pujita Ponnada Pics: నాభి అందాలతో పిచ్చెకిస్తున్న పూజిత పొన్నాడ.. తెలుగందం గ్లామర్ డోస్ మాములుగా లేదుగా!


Also Read - Prabhas Maruti Movie: ప్రభాస్‌-మారుతి సినిమాలో హీరోయిన్ ఫిక్స్... షూటింగ్ స్టార్ట్ అయ్యేది అప్పుడే...


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook