Prabhas Maruti Movie: ప్రభాస్‌-మారుతి సినిమాలో హీరోయిన్ ఫిక్స్... షూటింగ్ స్టార్ట్ అయ్యేది అప్పుడే...

Prabhas Maruti Movie: ప్రభాస్-మారుతి కాంబోలో తెరకెక్కనున్న సినిమాలో హీరోయిన్‌గా అనుష్కను ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. పలువురు హీరోయిన్ల పేర్లు అనుకున్నప్పటికీ చివరకు అనుష్కనే బెటర్ ఛాయిస్ అని మారుతి డిసైడ్ అయినట్లు ప్రచారం జరుగుతోంది.

Written by - ZH Telugu Desk | Last Updated : May 31, 2022, 08:43 AM IST
 Prabhas Maruti Movie: ప్రభాస్‌-మారుతి సినిమాలో హీరోయిన్ ఫిక్స్... షూటింగ్ స్టార్ట్ అయ్యేది అప్పుడే...

Prabhas Maruti Movie: బాహుబలి సినిమాతో ప్యాన్ ఇండియా స్టార్‌గా మారిన ప్రభాస్ వరుసపెట్టి సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ప్రభాస్ ప్రశాంత్ నీల్ దర్వకత్వంలో సలార్, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రాజెక్ట్ కె సినిమాల్లో నటిస్తున్నాడు. ప్రభాస్ మరో సినిమా ఆది పురుష్ ఇప్పటికే షూటింగ్ పూర్తయి ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్‌లో ఉంది. ఇక మారుతితో కలిసి మరో సినిమాను పట్టాలెక్కించేందుకు సిద్ధమవుతున్నాడు ప్రభాస్. ఈ మూవీకి సంబంధించి తాజాగా ఓ క్రేజీ అప్‌డేట్ తెర పైకి వచ్చింది.

'రాజా డీలక్స్' టైటిల్‌తో తెరకెక్కనున్న ఈ సినిమాలో ప్రభాస్ సరసన అనుష్కను హీరోయిన్‌గా ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. మొదట పలువురు హీరోయిన్ల పేర్లు అనుకున్నప్పటికీ చివరకు అనుష్క పేరునే ఫైనల్ చేసినట్లు చెబుతున్నారు. సినిమాలో హీరోయిన్ పాత్రకు మంచి ప్రాధాన్యం ఉండటంతో అనుష్కను ఎంచుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికైతే దీనిపై మారుతి నుంచి కానీ మేకర్స్ నుంచి కానీ ఎటువంటి ప్రకటన రాలేదు.

ప్రభాస్-అనుష్క జోడీకి ఉన్న క్రేజ్‌ గురించి అందరికీ తెలిసిందే. ఒకానొక దశలో ఈ ఇద్దరు పెళ్లి పీటలు కూడా ఎక్కబోతున్నారనే ప్రచారం జోరుగా జరిగింది. కానీ స్వీటీ, ప్రభాస్ కేవలం స్నేహితులేనని పెళ్లి ఆలోచన వారికి లేదని ప్రభాస్ పెద్దమ్మ క్లారిటీ ఇచ్చేశారు. బిల్లా, మిర్చి, బాహుబలి సినిమాల్లో జోడీగా నటించిన ఈ జంట... ఇప్పుడు మారుతి చిత్రం కోసం మరోసారి జతకట్టనున్నట్లు గాసిప్స్ వినిపిస్తుండటంతో ప్రేక్షకుల్లో సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి. 

మారుతి-ప్రభాస్ కాంబినేషన్‌లో హార్రర్ కామెడీగా తెరకెక్కనున్న ఈ సినిమా షూటింగ్ సెప్టెంబర్ నుంచి మొదలుకానున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసిన మారుతి... క్యాస్టింగ్ కూడా దాదాపుగా పూర్తి చేసినట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూట్ జరగనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రభాస్ చివరి రెండు సినిమాలు సాహో, రాధేశ్యామ్ భారీ అంచనాల నడుమ విడుదలై డిజాస్టర్‌గా మిగిలిన సంగతి తెలిసిందే. దీంతో ప్రభాస్ నుంచి మరో సినిమా కోసం అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

Also Read: BJP Rajya Sabha Candidates: రాజ్యసభకు బీసీ నేత డా.లక్ష్మణ్... వ్యూహాత్మకంగా వ్యవహరించిన కమలదళం..

Also Read: Group-1 2022: గ్రూప్‌-1కు రికార్డు స్థాయిలో దరఖాస్తులు...నేటితో ముగియనున్న గడువు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G 

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

Trending News