Lucky Dreams, Bad Dreams: నిద్రలో ఉన్నప్పుడు కలలు రావడం సహజం. అయితే అందులో కొన్ని పీడకలలు ఉంటాయి. ఇంకొన్ని ఎంతో సంతోషాన్నిచ్చే కలలు ఉంటాయి. పీడ కల వచ్చినప్పుడు నిజ జీవితంలో ఇలా మాత్రం జరగొద్దని.. అలాగే మంచి కలలు వచ్చినప్పుడు ఈ కల నిజమైతే ఎంత బాగుండు అని అని అనుకోవడం సర్వసాధారణం. ఇంకొన్నిసార్లు కలను ఎంజాయ్ చేయడం కంటే.. ఈ కల ఎందుకు వచ్చిందా అని ఆలోచించడమే ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే కొన్ని కలలు కలిసి వస్తే.. ఇంకొన్ని కలలు తరువాత ఎదుర్కోబోయే ఇబ్బందులకు సంకేతాలుగా భావిస్తుంటారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇంతకీ ఎలాంటి కల వస్తే  మేలు జరుగుతుంది, ఎలాంటి కల వస్తే నష్టం కలుగుతుంది అనే సందేహం మాత్రం చాలామందిని వేధిస్తుంటుంది. ఈ విషయంలో ఒక్కొక్కరి అభిప్రాయం ఒక్కోలా ఉంటుంది. ఎవరి అభిప్రాయాలు ఎలా ఉన్నా .. కలల శాస్త్రం ఏం చెబుతోంది అనేదే ఇప్పుడు మనం తెలుసుకుందాం. స్వప్న శాస్త్రంలో కలల గురించి చాలా వివరంగా పేర్కొన్నారు. స్వప్న శాస్త్రంలో పేర్కొన్న వివరాల ప్రకారం ప్రతీ కల వెనుక ఏదో ఒక అర్థం ఉంటుందట. స్వప్న శాస్త్రం ప్రకారం కొన్ని రకాల కలలు లక్ష్మీ దేవి కటాక్షానికి సంకేతాలుగా చెప్పుకోవచ్చునట.  


దేవాలయం అంటేనే చాలా పవిత్రమైన ప్రదేశంగా భావిస్తుంటాం. స్వప్న శాస్త్రం ప్రకారం, కలలో దేవాలయానికి వెళ్లినట్టుగా కల వస్తే.. అది శుభప్రదంగా పరిగణించబడుతుంది. కలలో ఆలయాల సందర్శనతో లక్ష్మీదేవి వరిస్తుందని స్వప్న శాస్త్రం చెబుతోంది.


ఎరుపు చీరను లక్ష్మీదేవికి చిహ్నంగా చూస్తారు. ఎందుకంటే లక్ష్మీదేవికి ఎరుపు రంగు వస్త్రం అంటే చాలా ఇష్టంగా చెబుతుంటారు. మీరు కూడా ఎరుపు రంగు చీరలో లక్ష్మీదేవి విగ్రహాలను చూసే ఉంటారు. లక్ష్మి దేవికి పూజలో అమ్మవారికి ఎరుపు చీర లేదా వస్త్రాలు సమర్పిస్తారు. అందుకే ఒకవేళ కలలో ఎరుపు చీర కనిపించిందంటే.. అది లక్ష్మీదేవి అనుగ్రహంగానే భావించాలంటున్నారు.


కలలో పువ్వులు లేదా పూల పడకలు వస్తున్నాయంటే.. అది ఆర్థిక ప్రయోజనాలకు శుభసూచకంగా చెబుతుంటారు. పువ్వులు లక్ష్మీ దేవి రాకకు సంకేతమని.. అందుకే కలలో పూలు వస్తే చాలా మంచిదనే భావన ఉంది. కలలో నగలు కనిపిస్తే, అది కూడా లక్ష్మి దేవికి చిహ్నంగానే భావిస్తుంటారు.


భారీ వర్షం కురిసినట్టుగా కలలు వస్తే.. జీవితంలో డబ్బు కూడా అలాగే కనక వర్షం కురుస్తుందని స్వప్న శాస్త్రం చెబుతోంది. 


డబ్బును జాగ్రత్తగా పొదుపు చేయడం లేదా భద్రంగా దాచిపెట్టడం వంటివి కలలో కనిపిస్తే, మీ ఆర్థిక పరిస్థితి మరింత బలపడుతుందని అర్థమట. స్వప్న శాస్త్రం ప్రకారం.. అలాంటి కలలు వస్తే అత్యంత శుభ సూచికంగా భావిస్తుంటారు. 


(గమనిక: ఇక్కడ పేర్కొన్న వివరాలన్నీ సాధారణంగా విశ్వాసాలపై ఆధారపడి ఉంటాయి. వీటిని జీ తెలుగు న్యూస్ ధృవీకరించడం లేదు)


ఇది కూడా చదవండి : KIA EV6 Car: ఈ క్రేజీ కారు కొనేవారికి షాకింగ్ న్యూస్


ఇది కూడా చదవండి : Amul Franchise Investment: అమూల్ ఫ్రాంఛైజీతో భారీ లాభాలు.. 2 లక్షల పెట్టుబడితో నెలకు రూ. 5 లక్షల వరకు లాభం


ఇది కూడా చదవండి : SBI Loans: గుడ్ న్యూస్.. ఏ సెక్యురిటీ లేకుండానే 10 లక్షల రుణం ఇస్తోన్న ఎస్బీఐ



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook