Rudraksha and Zodiac Signs: రుద్రాక్ష లాభాలు, ఏ రాశివారు ఎలాంటి రుద్రాక్షలు ధరించాలి ?
Rudraksha and Zodiac Signs: హిందూమతం ప్రాకరం రుద్రాక్షకు విశేష ప్రాధాన్యత, ప్రాముఖ్యత ఉన్నాయి. శివుని కటాక్షం కోసం రుద్రాక్షను ధరిస్తుంటారు. అదే మీ రాశి ప్రకారం రుద్రాక్షను ధరిస్తే..చాలా ప్రయోజనాలు కలుగుతాయట..
Rudraksha and Zodiac Signs: హిందూమతం ప్రాకరం రుద్రాక్షకు విశేష ప్రాధాన్యత, ప్రాముఖ్యత ఉన్నాయి. శివుని కటాక్షం కోసం రుద్రాక్షను ధరిస్తుంటారు. అదే మీ రాశి ప్రకారం రుద్రాక్షను ధరిస్తే..చాలా ప్రయోజనాలు కలుగుతాయట..
హైందవమత నమ్మకాల ప్రకారం రుద్రాక్ష అనేది శివుడి కన్నీరు నుంచి ఉత్పన్నమైంది. అందుకే దీనికి శుభంగా భావిస్తారు. శివుడి కటాక్షం పొందేందుకు చాలామంది రుద్రాక్షను ధరిస్తుంటారు. రుద్రాక్ష సంబంధమనేది దేవతలు, నవగ్రహాలతో ముడిపడి ఉంది. రుద్రాక్షను ధరించేముందు..ప్రాణ ప్రతిష్ట అత్యవసరం. ఒకవేళ మీరు కనుక మీ రాశి ప్రకారం రుద్రాక్షను ధరిస్తే..ఇక తిరుగుండదంట. అందుకే ఇప్పుడు రుద్రాక్ష లాభాలు పరిశీలిద్దాం..
రాశి ప్రకారం రుద్రాక్ష ధారణ ఎలా
మేషరాశివారు ఏకముఖ రుద్రాక్షను ధరించాలని పండితులు చెబుతున్నారు. దీంతోపాటు త్రిముఖం లేదా పంచముఖ రుద్రాక్ష కూడా ధరిస్తే మంచిదంటున్నారు.
వృషభరాశివారు నాలుగు ముఖాలు, ఆరు ముఖాలు, 14 ముఖాల రుద్రాక్షను ధరించాల్సి ఉంటుంది. ఇలా చేస్తే వారి జీవితంలో శుభసంతోషాలు ప్రాప్తిస్తాయి.
మిధునరాశి వారైతే..రుద్రాక్షను ప్రాణప్రతిష్ట చేసిన తరువాత..నాలుగు, ఐదు లేదా 13 ముఖాల రుద్రాక్షను ధరించాలి. దీనితో ఈ రాశివారికి సౌభాగ్యం లభిస్తుంది.
కర్కాటకరాశివారైతే..జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ఏకముఖం, మూడు లేదా ఐదు ముఖాల రుద్రాక్షను ధరించాలి. దీంతో సుఖ సంతోషాలు లభిస్తాయి.
సింహరాశివారికి ఏకముఖం, మూడు లేదా పంచ ముఖాల రుద్రాక్షను ధరిస్తే..అంతా శుభం కలుగుతుందని నమ్మకం
కన్యారాశివారు జీవితంలో పాజిటివ్ పరిణామాలు, శివుని కటాక్షం కోసం నాలుగు, ఐదు లేదా 13 ముఖాల రుద్రాక్షను తప్పకుండా ధరించాల్సి ఉంటుంది.
తులరాశివారి నాలుగు, ఆరు లేదా 14 ముఖాల రుద్రాక్షనే ధరించాల్సి ఉంటుంది. ఇలా చేస్తే అనేక శుభాలు కలుగుతాయట.
వృశ్చికరాశివారు జీవితంలో సుఖ సంతోషాల కోసం త్రిముఖ, పంచముఖ లేదా గౌరీ శంకరుని రుద్రాక్షను ధరించాలి.
ధనస్సు రాశివారైతే..ఏకముఖ, త్రిముఖ లేదా పంచముక రుద్రాక్షను ధరించాల్సి ఉంటుంది. ఇలా చేస్తే తప్పకుండా శుభాలు కలుగుతాయి.
Also read: Apara Ekadashi 2022: అపర ఏకాదశి ఉపయోగాలు, ఆ ఏడు పనులు అస్సలు చేయకూడదు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook