Kartika Purnima 2023: కార్తీక పౌర్ణమి అసలు తేదీ, దీపారాధన సమయాలు, కార్తీక పౌర్ణమి ప్రత్యేకత..
Kartika Purnima Date 2023: ప్రతి సంవత్సరం వచ్చే కార్తీక పౌర్ణమి కి హిందూ సాంప్రదాయం ప్రకారం ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ సంవత్సరం కార్తీక పౌర్ణమి తిథి నవంబర్ 26వ తేదీ నుంచి ప్రారంభమై 27 వ తేదీ రోజు ముగియబోతోంది. అయితే ఏ రోజు శివ ఆరాధనకు మంచి సమయమో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Kartika Purnima Date 2023: ప్రతి సంవత్సరం భారతీయులు కార్తీక పౌర్ణమిని కార్తీకమాసంలోని శుక్లపక్షం పౌర్ణమితిగా తిథి రోజు జరుపుకుంటారు. అంతేకాకుండా ఈ కార్తీక పౌర్ణమి రోజున చాలామంది ఉత్తరాది భారతీయులు దేవ్ దీపావళి పండగను కూడా జరుపుకుంటారు. ఈ పండగ కార్తీక అమావాస్య తర్వాతి రోజున జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఈ పండగకి ఎంతో ముఖ్యమైన ప్రాముఖ్యత ఉంది. ఈరోజు కాశీలోని వారణాసిలో అన్ని ఘాట్ వద్ద మట్టి దీపాలను వెలిగించి ప్రత్యేక పూజలు చేస్తారు.
ఈ దేవ్ దీపావళి పండకి పురాణాల్లో ప్రత్యేక కథలు ఉన్నాయి. ఈరోజు మహాశివుడు త్రిపుర సురుడు అనే రాక్షసుడిని సంహరించడం కారణంగానే దేవతామూర్తులంతా కలిసి ఈ దేవ్ దీపావళి పండగనే ఘనంగా జరుపుకున్నారని పురాణాల్లో పేర్కొన్నారు. అందుకే భారతీయులంతా దీపాలను వెలిగించి ఎంతో ఘనంగా గంగా నది ఒడ్డున ప్రత్యేక పూజలు చేస్తారు. అయితే ఈ సంవత్సరం రాబోయే దేవ్ దీపావళి పండగతో పాటు కార్తీక మాసానికి ప్రత్యేక ప్రాముఖ్యత కలిగి ఉంది. ఈ పండగ ఉన్న ప్రత్యేకత ఏంటో? ఈ సమయంలో ఏర్పడే యోగాల కారణంగా కలిగే లాభాలు ఏంటో? మనం ఇప్పుడు తెలుసుకుందాం.
Also Read: CM Jagan Mohan Reddy: 10,511 జంటలకు రూ.81.64 కోట్ల లబ్ధి.. అకౌంట్‌లోకి డబ్బులు జమ
కార్తీక పౌర్ణమి ప్రత్యేకత:
పురాణాల ప్రకారం ఈ కార్తీక పౌర్ణమి రోజున 6 కృత్తికాలైన శివుడు, సంభూతి, సంతతి, ప్రీతి, అనుసూయ, క్షమలను పూజించడం వల్ల సంతానం కలుగుతుందని భక్తులను నమ్మకం. అయితే ఈరోజు మహాశివుడు త్రిపుర సురుడు అనే రాక్షసుడిని అతి క్రూరంగా సంహరిస్తాడు. దీంతో దేవతలందరూ కలిసి దేవ్ దీపావళి పండగను ఎంతో ఆనందంగా జరుపుకుంటారు. అందుకే కార్తీక మాసంలోని ఈ కార్తీక పౌర్ణమి కి ప్రత్యేక ప్రాముఖ్యత లభించింది. ఈరోజు తల్లి పార్వతితో పాటు మహా శివుడిని పూజించి ఉపవాసాలు పాటించే వారికి కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి. అంతేకాకుండా జీవితంలో వచ్చే సమస్యలన్నీ దూరమవుతాయి.
కార్తీక పౌర్ణమి శుభ సమయాలు:
ఈ సంవత్సరం కార్తీక పౌర్ణమి తిథి నవంబర్ 26 ఆదివారం మధ్యాహ్నం 3 గంటల నుంచి ప్రారంభం కాబోతోంది. ఈ తిథి మరుసటి రోజు నవంబర్ 27వ తేదీ సోమవారం మధ్యాహ్నం 2:15 నిమిషాలకు ముగుస్తుంది. కాబట్టి మహా శివుడిని ఆరాధించాలనుకునేవారు ఈరోజు రాత్రి శుభ సమయాల్లో ప్రత్యేక పూజలు చేయడం చాలా శ్రేయస్కరం. ఉపవాసాలు పాటించేవారు కూడా ఈరోజు ఉదయం నుంచి ప్రారంభించడం చాలా మంచిది. ఇక దేవ్ దీపావళి పండగ విషయానికొస్తే.. నవంబర్ 27వ తేదీ ఉదయం నుంచి సాయంత్రం వరకు జరుపుకోవడం చాలా శుభదాయకమని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.
Also Read: CM Jagan Mohan Reddy: 10,511 జంటలకు రూ.81.64 కోట్ల లబ్ధి.. అకౌంట్‌లోకి డబ్బులు జమ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook