White Hair Solution: రూ.20 విలువ చేసే వస్తువుతో సులభంగా తెల్ల జుట్టుకు చెక్ పెట్టండి!
White Hair Solution: తెల్ల జుట్టు సమస్యలతో బాధపడేవారు ప్రతి రోజు ఈ కింది ఇంటి చిట్కాలను పాటిస్తే మంచి ఫలితాలు పొందుతారు. ఇందులో ఉండే ఆయుర్వేద గుణాలు సులభంగా తెల్ల జుట్టు నుంచి విముక్తి కలిగిస్తుంది.
White Hair Treatment: తెల్ల జుట్టు అనేది సహజమైన వృద్ధాప్య సంకేతం, కానీ కొందరికి ఇది ముందే వస్తుంది. తెల్ల జుట్టు రావడానికి అనేక కారణాలు ఉన్నాయి, వీటిలో జన్యుశాస్త్రం, ఒత్తిడి, పోషకాహార లోపాలే ప్రధాన కారణమని వైద్య నిపుణులు తెలుపుతున్నారు. తెల్ల జుట్టును పూర్తిగా నివారించడం సాధ్యం కాకపోయిన, కొన్ని ఇంటి చిట్కాలను వినియోగించి జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవచ్చు. అంతేకాకుండా జుట్టు రాలడాన్ని కూడా తగ్గించుకోవచ్చని నిపుణులు తెలుపుతున్నారు. అయితే తెల్ల జుట్టును నుంచి ఉపశమనం పొందడానికి ఎలాంటి హోమ్ రెమెడీస్‌ను వినియోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఇంటి చిట్కాలు:
నల్ల నువ్వులు:
నల్ల నువ్వుల్లో జింక్, విటమిన్ ఇ, ఇతర పోషకాలు అధిక పరిమాణంలో లభిస్తాయి. కాబట్టి వీటిని ప్రతి రోజు ఆహారాల్లో తీసుకోవడం వల్ల తెల్ల జుట్టు నుంచి సులభంగా ఉపశమనం పొందవచ్చు. అంతేకాకుండా జుట్టు ఆరోగ్యాన్ని కూడా పెంపొందిస్తాయి. కాబట్టి జుట్టు రాలడం, తెల్ల జుట్టు సమస్యలతో బాధపడేవారు రోజుకు ఒక టేబుల్‌స్పూన్ నల్ల నువ్వులు నేరుగా తినొచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
కరివేపాకు:
కరివేపాకులో శరీరానికి కావాల్సిన యాంటీఆక్సిడెంట్ల పరిమాణాలు అధిక మోతాదులో లభిస్తాయి. కాబట్టి జుట్టు కణాలను కాపాడేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తాయి. అంతేకాకుండా కరివేపాకు పేస్ట్‌ను తయారు చేసి స్కాల్ప్‌పై రాయడం వల్ల కూడా జుట్టు సమస్యల నుంచి విముక్తి పొందవచ్చు. అలాగే జుట్టు రాలడం కూడా సులభంగా తగ్గుతుందని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు.
బాదం నూనె:
బాదం నూనెలో విటమిన్ ఇ, ఇతర పోషకాలు అధిక పరిమాణంలో లభిస్తాయి. కాబట్టి దీనిని జుట్టుకు అప్లై చేయడం వల్ల జుట్టు తేమగా ఉంటుంది. అంతేకాకుండా బలంగా కూడా ఉంటుందని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు. అయితే తెల్ల జుట్టు సమస్యలతో బాధపడేవారు ప్రతి రోజు స్కాల్ప్‌పై బాదం నూనెను మసాజ్ చేసి..రాత్రంత ఉంచి, ఉదయాన్నే శుభ్రం చేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు.
Also Read Ibomma Downloading Option: ఒకే నిమిషంలో ఐ బొమ్మలో మూవీస్ డౌన్‌లోడ్ చేయడం ఎలా?
ఉసిరి:
ఆమ్లాలో విటమిన్ సి, ఇతర పోషకాలు అధిక మోతాదులో లభిస్తాయి. కాబట్టి ప్రతి రోజు దీనిని తీసుకోవడం వల్ల జుట్టును బలంగా, ఆరోగ్యంగా ఉంటుందని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు. తెల్ల జుట్టు సమస్యలతో బాధపడేవారు ప్రతి రోజు ఒక ఉసిరి తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. దీని కారణంగా జుట్టు రాలడం కూడా తగ్గుతుంది.
(నోట్: మేము అందించిన పై సమాచారం నమ్మకం, వాస్తవాలపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి దీనికి జీ తెలుగు న్యూస్‌కి ఈ స్టోరీకి ఎలాంటి సంబంధం లేదు.)
Also Read Ibomma Downloading Option: ఒకే నిమిషంలో ఐ బొమ్మలో మూవీస్ డౌన్‌లోడ్ చేయడం ఎలా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter