These 5 zodiac signs will get huge money due to Sun Transit 2022: జ్యోతిష్యశాస్రం ప్రకారం.. ప్రతి గ్రహం ఒక నిర్దిష్ట సమయంలో తన రాశి చక్రాన్ని మారుస్తుంటుంది. ఈ క్రమంలోనే గ్రహాల అధిపతి అయిన సూర్యుడు 2022 డిసెంబర్ 16న తన రాశి చక్రాన్ని మార్చాడు. వృశ్చిక రాశిని విడిచిన సూర్యుడు.. ధనుస్సు రాశిలోకి ప్రవేశించాడు. 2023 జనవరి 16 వరకు ధనుస్సు రాశిలో సూర్యుడు ఉంటాడు. ఈ సూర్యుని సంచారం అన్ని రాశి చక్రాలపై శుభ మరియు అశుభ ప్రభావాన్ని చూపుతుంది. ఏయే రాశుల సూర్య సంచారం కాలంలో మంచి ప్రయోజనాలను పొందబోతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కుంభం:
సూర్య సంచారం కుంభ రాశి వారికి చాలా లాభదాయకంగా ఉంటుంది. రవాణా రంగంలో ఉన్నవారు ప్రత్యేక ప్రయోజనాలను పొందుతారు. పెట్టుబడి పెట్టిన డబ్బు ఈ సమయంలో లాభదాయకంగా ఉంటుంది. ఆరోగ్యం బాగుంటుంది. పెళ్లి సంబంధాలకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. ఎలాంటి శ్రమ లేకుండానే మీకు ఆదాయం వస్తుంది. 


ధనస్సు:
డిసెంబర్ 16న ధనస్సు రాశిలోకి సూర్యుడు ప్రవేశించాడు. దాంతో ధనస్సు రాశి వారు తమ కార్యాలయంలో ప్రశంసించబడతారు. ఒక ప్రాజెక్ట్‌కు నాయకత్వం వహించే అవకాశం ఉంది. వ్యక్తిగత జీవితంలోని సమస్యలు తొలగిపోతాయి. ప్రేమికులకు కూడా ఈ సమయం కలిసి రానుంది. 


కన్యా:
ధనుస్సు రాశిలో సూర్యుని సంచారం కన్యా రాశి వారికి శుభప్రదం అవుతుంది. పెద్దల సహకారం మీకు ఉంటుంది. అంతేకాదు పెద్దల సలహాలు కూడా మీకు ప్రయోజనకరంగా ఉంటాయి. తల్లి పట్ల ప్రేమాభిమానాలు పెరుగుతాయి. గృహ జీవితంలోని సమస్యలు తొలగిపోతాయి. వ్యాపారులకు ఈ సమయం చాలా లాభదాయకం.


కర్కాటకం:
కర్కాటక రాశి వారికి సూర్య సంచారము చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడే అవకాశం ఉంది. ఆరోగ్యంపై మంచి ప్రభావం ఉంటుంది. మానసిక ఒత్తిడి నుంచి ఉపశమనం పొందవచ్చు. కొంతమంది మీ పురోగతిని చూసి అసూయపడవచ్చు. సమాజంలో పేరు ప్రఖ్యాతులు పొందుతారు.


వృషభం:
వృషభ రాశికి చెందిన వారికీ సూర్య సంచారం చాలా ప్రత్యేకమైనది. ఆర్థిక పరిస్థితిలో చాలా మార్పులు ఉంటాయి. పెట్టుబడి పెట్టినట్లయితే ఈ కాలంలో ప్రత్యేక ప్రయోజనాలు ఉండవచ్చు. ఆస్తి సంబంధిత ప్రయోజనాలు కూడా పొందవచ్చు. ఈ సమయం మీకు అన్ని పనుల్లో శుభ ఫలితాలను ఇవ్వబోతోంది.


Also Read: Kuldeep Yadav: కుల్దీప్‌ యాదవ్‌ సరికొత్త చరిత్ర.. అశ్విన్‌, కుంబ్లే రికార్డ్స్ బ్రేక్!  


Also Read: Cheteshwar Puajra Century: 52 ఇన్నింగ్స్‌ల తర్వాత శతకం.. చతేశ్వర్‌ పుజారా కెరీర్‌లో ఫాస్టెస్ట్ సెంచరీ!  


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook.