Kuldeep Yadav breaks R Ashwin, Anil Kumble record after took 5 wicket haul vs Bangladesh: దాదాపు రెండేళ్ల పాటు టెస్టు క్రికెట్‌కు దూరం అయిన మణికట్టు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్.. ప్రస్తుతం బంగ్లాదేశ్‌తో జరుగుతోన్న తొలి టెస్టులో సత్తాచాటాడు. మొదటి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు పడగొట్టాడు. 16 ఓవర్లు బౌలింగ్ చేసిన కుల్దీప్.. 40 పరుగులు ఇచ్చి ఐదు వికెట్లు తీశాడు. అంతకుముందు బ్యాటింగ్‌లో 40 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. 2021 ఫిబ్రవరిలో ఇంగ్లండ్‌పై చివరిగా టెస్టు ఆడిన కుల్దీప్.. 2022 డిసెంబర్ వరకు సుదీర్ఘ ఫార్మాట్లో అవకాశం రాలేదు.
బంగ్లాదేశ్‌పై ఐదు వికెట్లతో చెలరేగిన కుల్దీప్ యాదవ్ ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. బంగ్లాదేశ్ గడ్డపై అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసిన టీమిండియా స్పిన్నర్‌గా కుల్దీప్ రికార్డు నెలకొల్పాడు. అంతకుముందు ఈ రికార్డు భారత వెటరన్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ పేరిట ఉండేది. బంగ్లాలో జరిగిన ఓ టెస్టు మ్యాచ్‌లో అశ్విన్ 87 పరుగులు ఇచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. ఆ రికార్డును తాజాగా కుల్దీప్ బ్రేక్ చేశాడు. కుల్దీప్ 40 రన్స్ ఇచ్చి 5 వికెట్లు తీశాడు. ఈ జాబితాలో మూడో స్థానంలో మాజీ కెప్టెన్ అనిల్ కుంబ్లే ఉన్నాడు.
బంగ్లాదేశ్‌తో టెస్టులో భారత స్పిన్నర్ అత్యుత్తమ బౌలింగ్:
5/40 - కుల్దీప్ యాదవ్ (2022)
5/87 - ఆర్ అశ్విన్ (2015)
5/142 - సునీల్ జోషి (2000)
4/55- అనిల్ కుంబ్లే (2004)
ఓవర్‌నైట్ స్కోరు 133/8తో శుక్రవారం తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన బంగ్లా 150కే ఆలౌట్ అయింది. కుల్దీప్ యాదవ్ (5/40) టెస్టు కెరీర్ అత్యుత్తమ గణాంకాలు నమోదు చేశాడు. ఇక 254 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన భారత్ 258/2 స్కోర్ వద్ద డిక్లేర్ చేసింది. శుభ్‌మన్ గిల్ (110), చెతేశ్వర్ పుజారా (102 నాటౌట్) శతకాలు బాదారు. 513 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో రెండో ఇన్నింగ్స్ మొదలెట్టిన బంగ్లా 42/0తో ఆడుతోంది. నాలుగో రోజు ఆట మొదలైంది.
Also Read: Horoscope Today 17 December 2022: ఈరోజు రాశి ఫలాలు.. ఆ రెండు రాశుల ప్రేమికులు విజయాలు సాధిస్తారు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook.