Yama Raj Signals Before Death: 'పుట్టినవాడు గిట్టక తప్పదు... మరణించినవాడు మరల జన్మించక తప్పదు..' అని భగవద్గీత చెబుతుంది. వ్యక్తి కర్మానుసారమే అతని చావు, బతుకులు నిర్ణయమవుతాయని  శాస్త్రాలు చెబుతున్నాయి. మనిషి పుట్టిన తేదీ లాగే అతను మరణించే తేదీ కూడా ముందే నిర్ణయమైపోతుందని శాస్త్రాల్లో పేర్కొన్నారు. శాస్త్రాల ప్రకారం మృత్యు దేవుడు యమధర్మరాజు. ఒక వ్యక్తికి మృత్యు గడియలు ఆసన్నమయ్యాయంటే యమ ధర్మరాజు సదరు వ్యక్తికి కొన్ని సంకేతాలు పంపిస్తాడు. ఆ సంకేతాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

యమ ధర్మరాజు మృత్యువు సంకేతాలు :


- జుట్టు నెరసిపోవడం


- దంతాలు ఊడిపోవడం


- కంటిచూపు మందగించడం


- శరీర అవయవాల పనితీరు దెబ్బతినడం


ఈ సంకేతాల వెనక ఓ కథ :


హిందూ పురాణాల ప్రకారం... అమృత్ అనే వ్యక్తి యమునా నది ఒడ్డున నివసించేవాడు. అతను పగలు, రాత్రి యమ ధర్మరాజును పూజించేవాడు. అతని పూజలకు అనుగ్రహించి... ఒకరోజు యమ ధర్మరాజు అతన్ని ఏం వరం కావాలో చెప్పమని కోరాడు. అప్పుడతను తనకు అమరత్వం కావాలని యమరాజును కోరాడు. అయితే అది అసాధ్యమని... వ్యక్తి మరణం అతను పుట్టినప్పుడే నిర్ణయమవుతుందని యమ ధర్మరాజు అతనితో చెప్పాడు. దీంతో అమృత్.. అది సాధ్యం కాకపోతే మరణాన్ని ముందే తెలుసుకునే వరం ఇవ్వండని కోరాడు. అందుకు అంగీకరించి యమ ధర్మరాజు ఆ వరాన్నిప్రసాదించాడు. 


యమ ధర్మరాజు నుంచి వరం పొందాక అమృత్ ప్రవర్తనలో పూర్తిగా మార్పు వచ్చింది. పూజలు చేయడం మానేశాడు. విలాస జీవితానికి అలవాటుపడ్డాడు. మరణం గురించి ఏ కోశాన ఎక్కడా చింత లేదు. ఈ క్రమంలో అతని జుట్టు తెల్లబడటం మొదలైంది. రోజులు గడిచే కొద్ది పళ్లు కూడా ఊడటం మొదలయ్యాయి. కొద్దిరోజులకు కంటిచూపు మందగించింది. కొన్నాళ్లకు మంచానికే పరిమితమయ్యాడు. అయినా అవేవీ తన మరణానికి సంకేతాలని అమృత్ భావించలేదు. పైగా యమ ధర్మరాజు తనకు మరణ సంకేతాలేమీ పంపించట్లేదని భావించాడు. ఆ తర్వాత కొద్దిరోజులకే అతను మరణించాడు.


పై లోకానికి వెళ్లాక అక్కడ యమ ధర్మరాజును అమృత్ ప్రశ్నించాడు. నాకిచ్చిన వరం ప్రకారం మృత్యువు సమీపించే ముందు 4 సంకేతాలు ఉంటాయని చెప్పి... అసలు సంకేతాలే ఇవ్వలేదని అసంతృప్తి, అసహనం వ్యక్తం చేశాడు. దానికి యమ ధర్మరాజు.. జుట్టు తెల్లబడటం, పండ్లు ఊడిపోవడం, కంటిచూపు దెబ్బతినడం, మంచానికే పరిమితమవడం ఇవన్నీ మృత్యువు సంకేతాలేనని బదులిచ్చాడు. విలాసవంతమైన జీవనశైలికి అలవాటుపడి ఆ సంకేతాలను అర్థం చేసుకోలేకపోయావని చెప్పాడు. యమ ధర్మరాజు చెప్పింది విని అమృత్ పశ్చాత్తాపానికి గురయ్యాడు. 


Also Read: KGF Rocky Bhai: కేజీఎఫ్ రాకీభాయ్ ఎఫెక్ట్... విపరీతంగా సిగరెట్లు తాగి ఆసుపత్రిపాలైన బాలుడు... 


Also Read ; Dhoni Jharkhand Election: ఐపీఎల్ ముగిసిన తర్వాత ఎలక్షన్ డ్యూటీలో మహేంద్ర సింగ్ ధోనీ?


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి