Boy Inspired by KGF Rockybhai Smokes Cigarettes: కొన్ని సందర్భాల్లో సినిమాల్లోని పాత్రలు థియేటర్ నుంచి బయటకొచ్చాక కూడా వెంటాడుతుంటాయి. ఆయా వ్యక్తుల మైండ్ సెట్‌ను బట్టి కొన్ని పాత్రలకు బాగా కనెక్ట్ అవుతుంటారు. ముఖ్యంగా ఇప్పటి యువతపై సినిమా హీరోల ప్రభావం ఎక్కువ. తెరపై హీరో గారి డైలాగ్స్, స్టైల్స్, ఫైట్లు చూసి... నిజ జీవితంలోనూ కొందరు వాటిని అనుకరిస్తుంటారు. ఇలాగే ఓ టీనేజ్ బాలుడు కేజీఎఫ్ 2 సినిమా చూసి.. అందులో రాకీభాయ్ సిగరెట్ తాగే స్టైల్‌కు ఫిదా అయ్యాడు. అంతేనా.. రాకీభాయ్ లాగే సిగరెట్ల మీద సిగరెట్లు కాల్చాడు. విపరీతంగా స్మోక్ చేయడంతో అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరాడు. హైదరాబాద్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది.
హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్‌కి చెందిన 15 ఏళ్ల బాలుడు ఇటీవల కేజీఎఫ్ 2 సినిమా చూశాడు. సినిమా బాగా నచ్చడంతో 2 రోజుల్లో మూడుసార్లు చూశాడు. సినిమాలో రాకీభాయ్ క్యారెక్టర్‌కు విపరీతంగా కనెక్ట్ అయ్యాడు. థియేటర్ నుంచి బయటకొచ్చాక కూడా రాకీభాయ్ ప్రభావం అతన్ని వెంటాడింది. ముఖ్యంగా రాకీభాయ్ సిగరెట్ తాగే స్టైల్ అతన్ని బాగా ఆకర్షించింది. దీంతో రాకీభాయ్ లాగే తాను కూడా సిగరెట్లు తాగడం మొదలుపెట్టాడు. అంతకుముందెప్పుడూ సిగరెట్ చేతపట్టని అతను... రాకీభాయ్ ప్రభావంతో ఒకేరోజు ఒక పెట్టె సిగరెట్లు ఖాళీ చేసేశాడు.
సిగరెట్లు ఎక్కువగా కాల్చడంతో తీవ్రమైన గొంతు నొప్పి, దగ్గు మొదలయ్యాయి. దీంతో తల్లిదండ్రులు అతన్ని హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు తగిన వైద్యం సాయం అందించడంతో పాటు బాలుడికి కౌన్సెలింగ్ ఇచ్చి పంపించారు. ఈ కేసుపై ఆ ఆసుపత్రి వైద్యుడు ఒకరు మాట్లాడుతూ... రాకీభాయ్ లాంటి పాత్రలకు టీనేజర్స్ ఇట్టే ఆకర్షితులవుతారని పేర్కొన్నారు. రాకీభాయ్ పాత్ర ప్రభావంతో ఒకేరోజు పెట్టె సిగరెట్లు తాగి ఆ బాలుడు అనారోగ్యానికి గురయ్యాడని చెప్పారు.
సమాజంపై సినిమాల ప్రభావం చాలా ఉంటుంది కాబట్టి... సినిమాలు తీసేవారు స్మోకింగ్, మద్యపానం, పొగాకు అలవాట్లను గ్లామరైజ్ చేసి చూపించకూడదని అన్నారు. స్మోకింగ్ ఆరోగ్యంపై చాలా దుష్ప్రభావం చూపిస్తుందని శ్వాసకోశ సమస్యలతో పాటు ఫిజికల్ ఫిట్‌నెస్‌పై ప్రభావం చూపుతుందని పేర్కొన్నారు. స్మోకింగ్‌కి అడిక్ట్ అయ్యేవాళ్లలో 85 శాతం మంది 18 ఏళ్ల వయసులో మొదటిసారి దాన్ని ప్రయత్నించినవారేనని పేర్కొన్నారు.
Also Read: Balaiah Poster Release: బాలయ్య NBK107 పోస్టర్ విడుదల, రౌద్రరూపంలో బాలకృష్ణ
Also Read: Homemade Packs: మెడ మీద ముడతలతో బాధపడుతున్నారా..అయితే ఈ ఇంటి చిట్కాలను ట్రై చేయండి.!!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి