Zodiac Change July 2022: జూలైలో ఆ గ్రహాల రాశి మార్పు.. 3 రాశుల వారిపై కుబేరుడి అనుగ్రహం.. ఆ ఒక్క రాశి వారికి కష్టాలే..
Zodiac Change in July 2022: జూలైలో పలు గ్రహాలు రాశి మారబోతున్నాయి. ఇది రాశిచక్రంలోని మొత్తం 12 రాశులను ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా 3 రాశుల వారికి ఈ కాలం బాగా కలిసిరానుంది.
Zodiac Change in July 2022: జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల రాశి మార్పు చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. గ్రహాలు రాశి మారిన ప్రతీసారి అది రాశిచక్రంలోని 12 రాశుల వారిపై ప్రభావం చూపుతుంది. వచ్చే జూలై 2న బుధ గ్రహం మిథున రాశిలోకి ప్రవేశించనుంది. జూలై 16న సూర్యుడు కర్కాటక రాశిలో సంచరించనున్నాడు. అలాగే శుక్రుడు, అంగారకుడు కూడా రాశిచక్రం మారనున్నారు. ఈ గ్రహాల రాశిచక్రంలో మార్పు వలన 3 రాశుల వారికి కుబేరుడి అనుగ్రహం కలగనుంది. ఒక రాశి వారికి మాత్రం కష్టాలు ఎదురవుతాయి.
మిథునం : ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వారికి ఈ నెలలో శుభవార్తలు అందుతాయి. వ్యాపార విస్తరణకు కొత్త ఒప్పందాలు జరుగుతాయి. ఉద్యోగం చేస్తున్న వ్యక్తులకు ప్రమోషన్ దక్కే అవకాశం ఉంటుంది. వచ్చే నెల పెట్టుబడులకు అనుకూలం. అనుకోని విధంగా ఆకస్మిక ధన లాభం ఉంటుంది.
సింహం : విదేశాల్లో ఉద్యోగం చేయాలనే మీ కల నెరవేరుతుంది. నిలిచిపోయిన అనేక పనులు పూర్తి కాగలవు. మీ పనికి తగిన ప్రశంసలు పొందుతారు. ఉద్యోగంలో కొత్త బాధ్యతలు చేపట్టాల్సి వస్తుంది. కొత్త జాబ్ ఆఫర్లు పొందుతారు. వ్యాపార రంగంలో విజయం సాధిస్తారు.
మేషం : ఈ రాశి వారు జూలైలో కాస్త జాగ్రత్తగా వ్యవహరించాలి. ఈ నెలలో మీరు చాలా సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. కుటుంబం ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవచ్చు. వ్యాధుల బారినపడవచ్చు. ఈ సమస్యాత్మక సమయంలో మీ కోపాన్ని నియంత్రించుకోండి. లేనిపక్షంలో మరింత ఇబ్బందులపాలవుతారు.
ధనుస్సు : జూలైలో ధనుస్సు రాశి వారికి అదృష్టం ఎక్కువగా ఉంటుంది. ఐశ్వర్యానికి అధిదేవత అయిన కుబేరుడు మీపై చాలా ధనాన్ని కురిపిస్తాడు. మీ ఆదాయం పెరుగుతుంది. కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడుతాయి. మీ పెట్టుబడికి ఇది మంచి సమయం. కోర్టు సంబంధిత విషయాలు పరిష్కరించబడతాయి.
(గమనిక: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ ఊహలు, సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)
Also Read: Horoscope Today June 18th : నేటి రాశి ఫలాలు.. ఈ 2 రాశుల వారికి ఉద్యోగంలో బదిలీ తప్పకపోవచ్చు..
Also Read: Agnipath Riots:వరంగల్ బీఎస్ఎన్ఎల్ కార్యాలయంపై రాళ్ల దాడి.. రాకేష్ అంతిమయాత్రలో ఉద్రిక్తత