COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Zodiac Signs Month: జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల సంచారానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది ముఖ్యంగా గ్రహాలలో అతిపెద్ద గ్రహాలు సంచారం చేసినప్పుడు అన్ని రాశుల వారిపై ప్రత్యేక ప్రభావం పడుతుంది. ఈ నెలలో శుక్రుడితో పాటు గురు గ్రహం సంచారం చేయబోతున్నాయి. అక్టోబర్ 4వ తేదీన గురు గ్రహం మేషరాశిలోకి తిరోగమన చేయడం.. దీంతోపాటు శుక్రుడు ప్రత్యక్షంగా సంచారం చేయడం వల్ల మొత్తం 12 రాశుల వారిపై ప్రత్యక్ష ప్రభావం పడబోతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఈ ప్రభావం కారణంగా కొన్ని రాశుల వారికి మంచి ప్రయోజనాలు కలిగితే మరికొన్ని రాశుల వారికి ఊహించని నష్టాలు కలిగే అవకాశాలు ఉన్నాయని నిపుణులు సూచిస్తున్నారు. అయితే అక్టోబర్ 4 నుంచి ఏయే రాశుల వారిపై ఎలాంటి ప్రభావం పడబోతోందో ఇప్పుడు మనం తెలుసుకుందాం..


మేషరాశి:
అక్టోబర్ 4వ తేదీ నుంచి మేష రాశి వారికి వ్యక్తిగత జీవితంలో హెచ్చుతగ్గులు ఉంటాయని జ్యోతిష్య శాస్త్రం నిపుణులు చెబుతున్నారు. ఈ సమయంలో వీరు మానసిక ఇబ్బందులు పడతారు. అంతేకాకుండా చిన్న చిన్న సమస్యలు వస్తాయి. కాబట్టి ఓపికతో వాటి నుంచి ఉపశమనం పొందాలి. అంతేకాకుండా ఈ రాశి వారికి చదవాలని ఓపిక కూడా పెరుగుతుంది. కాబట్టి ఈ సమయంలో కష్టపడి చదవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. 


వృషభ రాశి:
వృషభ రాశి వారికి అక్టోబర్ 4 నుంచి మనసు ఆనందంగా ఉంటుంది. దీంతోపాటు భక్తి భావంతో ఉంటారని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు పేర్కొన్నారు. సంతానం లేని సమస్యలతో బాధపడుతున్న వారు ఈ సమయంలో శుభవార్త వింటారు. దీంతో పాటు జీవిత భాగస్వామి పై ప్రేమ పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. భాగస్వామితో విహారయాత్రలకు వెళ్తారు.


Also Read: Rinku Singh: మళ్లీ సిక్సర్ల వర్షం కురిపించిన రింకూ సింగ్.. సూపర్ ఓవర్‌లో మెరుపులు.. వీడియో చూశారా..!  


మిథున రాశి:
ఈ రాశి వారికి సంతోషం రెట్టింపు అవుతుంది. అంతేకాకుండా ఓపిక కూడా పెరుగుతుంది. కాబట్టి ఈ సమయంలో ఎలాంటి పనులైనా సులభంగా చేయగలుగుతారు. ఇక ఉద్యోగాలు చేస్తున్న వారికి తోటి స్నేహితుల మద్దతు లభించి ఊహించని ఫలితాలు పొందుతారు. ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న వారికి సంపాదించుకోవడానికి మార్గాలు కూడా పెరుగుతాయి. అనారోగ్య సమస్యల నుంచి కూడా ఈ సమయంలో ఉపశమనం లభిస్తుంది.


కర్కాటక రాశి:
కర్కాటక రాశి వారికి కూడా మనసు ప్రశాంతంగా ఉంటుంది. దీంతోపాటు కుటుంబ సభ్యుల మద్దతు లభించి ఈ సమయంలో ఎలాంటి పనులైన సులభంగా చేయగలుగుతారు. ఇక విద్యను అభ్యసిస్తున్న వారు ఈ సమయంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలి. లేకపోతే విద్యాపరమైన ఇబ్బందులు తలెత్తే ఛాన్సులు కూడా ఉన్నాయి. ఉద్యోగాలు చేసే వారు కంపెనీలు మారే అవకాశాలు కూడా ఉన్నాయి. దీని కారణంగా ప్రమోషన్స్ కూడా పొందుతారు.


Also Read: Rinku Singh: మళ్లీ సిక్సర్ల వర్షం కురిపించిన రింకూ సింగ్.. సూపర్ ఓవర్‌లో మెరుపులు.. వీడియో చూశారా..!  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook