Frederique Overdijk 7 wickets in 4 overs: ఒక టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లో 7 వికెట్లు తీసిన తొలి క్రికెటర్‌గా నెదర్లాండ్స్‌కి చెందిన ఫీమేల్ క్రికెటర్ ఫ్రెడ్రిక్ ఓవర్‌డైక్ వరల్డ్ రికార్డ్ సొంతం చేసుకుంది. అది కూడా కేవలం 4 ఓవర్లలోనే కావడం ఒక విశేషం అయితే.. ఆ 4 ఓవర్లలో రెండు మెయిడెన్ ఓవర్స్ ఉండటం మరో విశేషం. ఇంకో చెప్పుకోదగిన గొప్ప విషయం ఏంటంటే.. ఈ నాలుగు ఓవర్లలో ఫ్రెడ్రిక్ ప్రత్యర్థులకు ఇచ్చింది కేవలం 3 పరుగులే. అవును.. ఇన్ని విశేషాలతో చరిత్ర సృష్టించిన నెదర్లాండ్స్ ఉమెన్ క్రికెట్ టీమ్‌కి చెందిన పేస్ బౌలర్ ఫ్రెడ్రిక్ పేరు ఇప్పుడు యురోపియన్ క్రికెట్ వర్గాల్లో మార్మోగిపోతోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గురువారం స్పెయిన్‌లో ఫ్రాన్స్‌తో జరిగిన మహిళల టీ20 వరల్డ్ కప్ యూరప్ క్వాలిఫయర్స్ మ్యాచ్‌లో  (women`s T20 World Cup Europe qualifiers) ఫ్రెడ్రిక్ ఈ వరల్డ్ రికార్డ్ సృష్టించింది. ఆరుగురిని బౌల్ చేసిన ఫ్రెడ్రిక్ (Netherlands pacer Frederique Overdijk) మరొకరిని ఎల్బీడబ్లూ చేసింది. 


ఫ్రాన్స్‌ను 17.5 ఓవర్లలో కేవలం 33 పరుగులకే పరిమితం చేసిన నెదర్లాండ్స్ ఆ తర్వాత 3.4 ఓవర్లలో 9 వికెట్ల తేడాతో ఫ్రాన్స్‌పై ఘన విజయం సాధించింది. నెదర్లాండ్స్ (Netherlands cricket) జట్టు ఘన విజయానికి కారణమైన ఫ్రెడ్రిక్‌ని అక్కడి క్రికెట్ ప్రియులు అభినందనల్లో ముంచెత్తుతున్నారు. 


Also read : INDvsENG 3rd Test: రూట్ సెంచరీ.. 345 పరుగుల ఆధిక్యంలో ఇంగ్లండ్! మూడో టెస్ట్ భారత్ చేజారినట్టేనా!!


టీ20 ఇంటర్నేషనల్ క్రికెట్‌లో గతంలో ఒకే మ్యాచ్‌లో ఆరు వికెట్లు తీసిన ఘనత నేపాల్‌కి చెందిన ఫీమేల్ క్రికెటర్ అంజలి చాంద్ పేరిట ఉంది. 2019లో మాల్దీవులపై (Maldives) ఒక్క పరుగు కూడా ఇవ్వకుండానే 6 వికెట్లు తీయడం ద్వారా అంజలి చాంద్ (Anjali Chand) ఈ రికార్డ్ సొంతం చేసుకుంది.


Also read : Ind Vs Eng:- హద్దులు దాటిన ఇంగ్లాండ్ అభిమానులు...సిరాజ్ స్ట్రాంగ్ కౌంటర్.. వీడియో!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook