Team India New Jersey Launch: భారత్ వేదికగా అక్టోబరు 05 నుంచి వన్డే వరల్డ్ కప్ ఆరంభం కానుంది. ఈ నేపథ్యంలో ఈ మెగా టోర్నీ కోసం భారత జట్టు ధరించబోయే కొత్త జెర్సీని విడుదల చేసింది బీసీసీఐ. టీమిండియా ప్లేయర్లు ఈ కొత్త జెర్సీలు ధరించి సందడి చేసిన వీడియోను కూడా రిలీజ్ చేశారు. దాదాపు 2 నిమిషాల నిడివి ఉన్న ఈ వీడియోలో కెప్టెన్‌ రోహిత్‌ శర్మతో పాటు మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ, వైస్‌ కెప్టెన్‌ హార్దిక్‌ ప్యాండ్యా, శుభమన్ గిల్, మహ్మద్‌ సిరాజ్‌తో పాటు పలువురు ఆటగాళ్లు ఈ కొత్త జెర్సీలో మెరిశారు. టీమిండియా అధికారిక కిట్‌ స్పాన్సర్‌గా అడిడాస్‌ వ్యవహారిస్తున్న సంగతి తెలిసిందే. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 టీమిండియా కొత్త జెర్సీ స్పాన్సర్‌గా అడిడాస్‌ వచ్చిన తర్వాత మూడు ఫార్మాట్లకు జెర్సీలను ఛేంజ్ చేసింది.  టీ20ల్లో కాలర్‌ లేకుండా డార్క్‌ బ్లూ కలర్‌ జెర్సీ, వన్డేల్లో కాలర్‌తో లైట్‌ బ్లూ కలర్‌ జెర్సీ, టెస్టుల్లో వైట్‌ కలర్‌ జెర్సీలను అడిడాస్‌ రూపొందించింది. అయితే జెర్సీలపై కుడివైపు అడిడాస్‌ లోగోను, ఎడమవైపు బీసీసీఐ టీమ్‌ లోగోతో పాటు మూడు నక్షత్రాలు, మధ్యలో లీడ్‌ స్పాన్సర్‌ డ్రీమ్‌ 11 పేరు, దాని కింద ఇండియా పేరును డిజైన్ చేశారు. 


మార్పులివే...
తాజాగా ప్రపంచకప్ నేపథ్యంలో కొత్త జెర్సీలో స్వల్ప మార్పులు చేసింది. భుజాలపై ఉన్న మూడు అడ్డ గీతలపై తెలుపు రంగు స్థానంలో తివర్ణ పతాకంలోని మూడు రంగులను ప్రింట్ చేశారు. టీమ్‌ లోగోపై ఉన్న మూడు నక్షత్రాలను రెండుకు కుదించారు. ఈ రెండు నక్షత్రాలు.. భారత్‌ రెండు వన్డే వరల్డ్‌కప్‌ (1983, 2011)లకు గుర్తుగా ఉంచారు. కొత్త జెర్సీపై అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 



ప్రపంచ కప్ కు భారత జట్టు:
రోహిత్ శర్మ (కెప్టెన్), శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, ఇషాన్ కిషన్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మొహమ్మద్. షమీ, మొహమ్మద్. సిరాజ్, కుల్దీప్ యాదవ్.


Also Read: ఒక్క మ్యాచ్​తో అగ్రస్థానానికి సిరాజ్.. వరల్డ్ నం.1 బౌలర్‌గా హైదరాబాదీ.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook