Pakistan Bad Fielding Video: యు ఫన్నీ.. సింపుల్ రనౌట్ మిస్ చేసిన పాక్ ఫీల్డర్లు.. ఇలా ఉన్నారంటేరయ్యా..!
AFG vs PAK 1st Odi Highlights: ఆసియా కప్‌కు ముందు పాక్, ఆఫ్ఘానిస్థాన్ జట్లు మూడు వన్డేల సిరీస్‌లో తలపడుతున్నాయి. మొదటి వన్డేలో ఆఫ్ఘానిస్థాన్‌పై పాక్ జట్టు 142 పరుగుల తేడాతో విజయం సొంతం చేసుకుంది. ఇక ఈ మ్యాచ్‌లో పాక్ ఫీల్డర్లు సింపుల్ రనౌట్‌ను మిస్ చేసిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
AFG vs PAK 1st Odi Highlights: పాకిస్థాన్ ఆటగాళ్లు ఒక్కోసారి మైదానంలో చేసే విన్యాసాలు క్రికెట్ అభిమానులకు నవ్వు తెప్పిస్తుంటాయి. ముఖ్యంగా ఫీల్డింగ్ విషయంలో పాక్ ఆటగాళ్లు సులభమైన క్యాచ్‌లు, ఈజీ రనౌట్‌లు మిస్ చేస్తూ ట్రోలింగ్‌కు గురవుతుంటారు. తాజాగా ఇలానే రనౌట్ మిస్ చేసి నవ్వులపాలయ్యారు. ఆసియా కప్‌కు ముందు పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్ మధ్య మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ జరుగుతోంది. శ్రీలంక హంబన్‌టోటాలోని మహింద రాజపక్స ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా తొలి వన్డేలో పాకిస్థాన్ 142 పరుగుల తేడాతో ఆఫ్టనిస్థాన్‌ను ఓడించింది. మొదట బ్యాటింగ్‌లో విఫలమైన పాక్ జట్టు.. తరువాత బౌలింగ్‌లో పుంజుకుని మ్యాచ్‌ను సొంతం చేసుకుంది.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన పాక్ 201 పరుగులకే ఆలౌటైంది. ఓపెనర్ ఇమామ్ ఉల్ హక్ (61) అర్ధసెంచరీతో జట్టును ఆదుకోగా.. ఇఫ్తికార్ అహ్మద్ (30), షాదాబ్ ఖాన్ (39) రాణించారు. మిగిలిన బ్యాట్స్‌మెన్లు విఫలమయ్యారు. అనంతరం ఇన్నింగ్స్ ఆరంభించిన ఆఫ్ఘనిస్థాన్ జట్టు కేవలం 59 పరుగులకే కుప్పకూలింది. హరీస్ రౌఫ్ ఐదు వికెట్లతో చెలరేగడంతో ఆఫ్టాన్ బ్యాట్స్‌మెన్ చేతులెత్తేశారు. దీంతో పాక్ జట్టు 142 పరుగుల తేడాతో విజయం సాధించింది.
ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ పేలవమైన ఫీల్డింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 4వ ఓవర్ వేసిన నసీమ్ షా .. ఇక్రమ్ అలీఖిల్‌కు ఫుల్లర్ యాంగ్లింగ్ బంతిని వేశాడు. బంతిని డిఫెన్స్ ఆడిన బ్యాట్స్‌మెన్.. వెంటనే పరుగు కోసం నాన్ స్ట్రైకింగ్ ఎండ్‌కు పరిగెత్తాడు. కానీ నాన్-స్ట్రైకర్ అయిన రహ్మానుల్లా గుర్బాజ్ ఆసక్తి చూపకపోవడంతో వెనక్కి వెళ్లిపోయాడు. కవర్స్ వద్ద ఫఖర్ జమాన్ బంతిని అందుకుని.. వికెట్లు దగ్గరే ఉన్నా డైరెక్ట్ త్రో చేయకుండా స్ట్రైకర్ ఎండ్ వైపు పరుగెత్తాడు. బ్యాట్స్‌మెన్ క్రీజ్ దగ్గరకు వచ్చే సమయంలో అండర్ ఆర్మ్ త్రోని చేశాడు. వికెట్‌కీపర్ రిజ్వాన్ రనౌట్ చేసేందుకు ప్రయత్నించి విఫలమయ్యాడు. సులువైన రనౌట్‌ను మిస్ చేసి పాకిస్థాన్ ఫీల్డర్లు నవ్వులపాలయ్యారు. ఈ వీడియోపై నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.
Also Read: Aditya L1 Mission: సూర్యుడిపై ఇస్రో కన్ను.. ఆదిత్య L1 రాకెట్ ప్రయోగానికి సిద్ధం
Also Read: Bandi Sanjay: కేసీఆర్.. క్యాన్సర్ కంటే డేంజర్.. నట్టేట ముంచిన బీఆర్ఎస్‌కు ఓటేస్తారా..?: బండి సంజయ్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి