ప్రపంచ కప్‌లో భాగంగా హెడింగ్లీ వేదికగా అఫ్ఘనిస్తాన్‌, పాకిస్తాన్ జట్ల మధ్య జరిగిన 36వ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న ఆప్ఘనిస్తాన్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 227 పరుగులు చేసింది. పాకిస్తాన్ ఫాస్ట్ బౌలర్ షాహీన్ షా అఫ్రిదీ తన కట్టుదిట్టమైన బౌలింగ్‌తో ఆదిలోనే తక్కువ పరుగులకే కీలకమైన వికెట్లు తీసి అఫ్ఘనిస్తాన్ నడ్డి విరిచాడు. ఇప్పటికే న్యూజీలాండ్‌తో ఆడిన మ్యాచ్‌లోనూ 28 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన షాహీన్ అఫ్రిది ఈ మ్యాచ్‌లోనూ తన ప్రతిభ కనబర్చాడు.


ఈ మ్యాచ్‌లో అఫ్ఘనిస్తాన్‌పై పాకిస్తాన్ విజయం సాధించాలంటే 228 పరుగుల విజయలక్ష్యాన్ని ఛేదించాల్సి ఉంటుంది. బౌలింగ్‌లో రాణించిన పాకిస్తాన్ బ్యాట్‌తోనూ అఫ్ఘనిస్తాన్‌కు సమాధానం చెప్పి పసికూనపై గెలుస్తుందా లేదా తెలియాలంటే పాక్ బ్యాటింగ్ పూర్తయ్యేవరకు వేచిచూడాల్సిందే.