Ravindra Jadeja: దోస్త్ మేరా దోస్త్.. కోహ్లీ, రోహిత్ బాటలోనే రవీంద్ర జడేజా ఆటకు వీడ్కోలు
Star All Rounder Ravindra Jadeja Retires From T20I: క్రికెట్‌లో తన స్నేహితుల వెంటనే రవీంద్ర జడేజా తన ఆటకు ముగింపు పలికాడు. కోహ్లీ, రోహిత్ బాటలోనే జడ్డూ తన టీ20 ఆటకు వీడ్కోలు చెప్పేశాడు.
Ravindra Jadeja: తన స్నేహితుల వెంటే స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా వెళ్లాడు. ప్రపంచకప్ గెలిచిన ఆనందంలో దిగ్గజ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ అంతర్జాతీయ టీ20 క్రికెట్‌కు వీడ్కోలు పలుకగా.. వారి బాటలోనే వారి స్నేహితుడు రవీంద్ర జడేజా నిలిచాడు. తన అంతర్జాతీయ పొట్టి క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. తన 15 ఏళ్ల సుదీర్ఘ చిన్న ఫార్మాట్‌కు బై బై చెప్పేశాడు.
Also Read: Virat Kohli Retirement: సంబరాల మధ్య విరాట్ కోహ్లీ సంచలనం.. టీ20 క్రికెట్‌కు వీడ్కోలు
దక్షిణాఫ్రికాతో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో భారత జట్టు విజయం సాధించి టీ 20 ప్రపంచకప్‌ను రెండోసారి ముద్దాడిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ గెలిచిన ఆనందంలో ఇదే సరైన సందర్భంగా భావించిన స్టార్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ తమ ఆటలకు వీడ్కోలు పలకగా.. వాళ్లు ప్రకటించిన కొన్ని గంటల్లోనే రవీంద్ర జడేజా కూడా తన కెరీర్‌కు ముగింపు పలికాడు.
Also Read: T20 World Cup 2024: అమెరికా గడ్డపై భారత్ రెపరెపలు.. సమష్టి కృషితో టీ20 ప్రపంచకప్ కైవసం
'నేను మనస్ఫూర్తిగా అంతర్జాతీయ టీ20లకు వీడ్కోలు పలుకుతున్నా. ఎప్పుడూ నా దేశం కోసం నా శక్తి మేరకు అత్యుత్తమ ఆట ఆడాను. ఇతర ఫార్మాట్‌లలో వన్డేలు, టెస్టుల్లో నా ఆట కొనసాగిస్తా. టీ 20 ప్రపంచకప్‌ను గెలవాలనే కల నిజమైంది. నా అంతర్జాతీయ టీ20 కెరీర్‌లో అత్యుతమైన దశ ఇది. ఇన్నాళ్లు నాకు మద్దతుగా నిలిచిన అభిమానులకు ధన్యవాదాలు' అంటూ జడేజా తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశాడు.
టీ20లో జడేజా ప్రస్థానం
పొట్టి ఫార్మాట్‌లోకి 2009లో రవీంద్ర జడేజా అరంగేట్రం చేశాడు. తన కెరీర్‌లో 74 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. స్టార్ ఆల్‌రౌండర్‌గా గుర్తింపు పొందిన జడేజా 515 పరుగులు చేసి.. 54 వికెట్లు పడగొట్టి భారత క్రికెట్‌లో కీలక పాత్ర పోషించాడు. కాగా ట్రోఫీ సాధించిన ఈ ప్రపంచకప్‌లో జడ్డూ తన ప్రభావం చూపించలేకపోయాడు. జట్టు కష్టాల్లో ఉన్న సమయంలో ఆదుకునే జడేజా ఆటకు వీడ్కోలు కోల్పోవడం భారత అభిమానులకు కలవరం గురి చేసింది. ఒకేసారి ముగ్గురు దిగ్గజ ఆటగాళ్లు ఆటకు వీడ్కోలు కోల్పోవడంతో అభిమానులు షాక్‌కు గురయ్యారు. ఒకరి తర్వాత ఒకరు ఆటకు విరామం ప్రకటించడంతో టీ20లో భారత ప్రదర్శన ఎలా ఉంటుందోనని ఆసక్తికరంగా మారింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter