Asaduddin Owaisi slams trolls on Mohammad Shami: మొహమ్మద్ షమిపై సోషల్ మీడియాలో వస్తున్న ట్రోల్స్‌ని ఏఐఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దిన్ ఒవైసి తీవ్రంగా ఖండించారు. నిన్న ఆదివారం దుబాయ్ స్టేడియం వేదికగా పాకిస్థాన్‌తో జరిగిన టీ20 వరల్డ్ కప్ మ్యాచ్‌లో భారత్ ఓటమికి టీమిండియా బౌలర్ మొహమ్మద్ షమిని బాధ్యుడిగా చేస్తూ అతడిని ట్రోలింగ్ చేస్తున్న వారిపై అసదుద్దీన్ ఒవైసి (AIMIM chief Asaduddin Owaisi) ఘాటు వ్యాఖ్యలు చేశారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

11 మంది ఆటగాళ్లు ఉన్న జట్టులో మొహమ్మద్ షమిపై మాత్రమే ఆరోపణలు చేయడానికి కారణం అతడు ఒక ముస్లిం వ్యక్తి అయ్యుండటమేనా అని అసదుద్దీన్ ప్రశ్నించారు. మొహమ్మద్ షమి ముస్లిం కావడం వల్లే అతడిపై ట్రోల్స్ చేస్తున్నారని మండిపడిన అసదుద్దీన్ ఒవైసి.. ఈ వైఖరిని కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపి సర్కారు (BJP govt) ఖండించగలదా అని నిలదీశారు. 


Also read : Varun Chakravarthy's bowling: వరుణ్ చక్రవర్తి బౌలింగ్ పాకిస్థాన్ గల్లీ క్రికెట్‌తో సమానం: సల్మాన్ భట్


ఆదివారం నాటి మ్యాచ్‌లో వాస్తవానికి భారత బౌలర్లు పెద్దగా రాణించలేకపోయారు. అందులో మొహమ్మద్ షమి పరిస్థితి మరీ ఇబ్బందికరంగా మారింది. 3.5 ఓవర్లలో 43 పరుగులు ఇచ్చిన మొహమ్మద్ షమి ప్రస్తుతం భారత్ ఓటమిని జీర్ణించుకోలేని వారికి సోషల్ మీడియాలో టార్గెట్‌గా మారిపోయాడు. సామాజిక మాధ్యమాల్లో మొహమ్మద్ షమి టైమ్ లైన్‌లోనే (Mohammad Shami trolled) అతడి పోస్టుల కింద బూతు రాతలతో పోస్టులు పెడుతూ అతడిని ట్రోల్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మొహమ్మద్ షమిని ట్రోల్స్ చేస్తున్న వారిపై మండిపడుతూ అతడికి అసదుద్దీన్ ఒవైసి (Asaduddin Owaisi supports Shami) అండగా నిలిచారు. 


ఇదిలావుంటే, మొహమ్మద్ షమిపై (Trolls on Mohammad Shami) మండిపడుతున్న నెటిజెన్స్‌పై వీరేందర్ సేహ్వాగ్ సైతం విరుచుకుపడ్డాడు. ఆటగాళ్లపై ఆన్‌లైన్ మాబ్ ఎటాక్ కరెక్ట్ కాదని నెటిజెన్స్‌కి హితవు పలికిన వీరందర్ సేహ్వాగ్.. '' వచ్చే మ్యాచ్‌లో రెచ్చిపోయి నువ్వేంటో చూపించు షమి'' అంటూ షమికి (Virender Sehwag slams trolls on Mohammad Shami) బూస్టింగ్ ఇచ్చాడు.


Also read : India vs Pakistan: T20 World cup లో10 హాఫ్ సెంచరీలు కొట్టిన తొలి ఆటగాడు Virat Kohli


Also read : Babar Azam about Ind vs Pak match result: ఇండియాపై పాక్ విజయంపై బాబర్ ఆజం ఏమన్నాడంటే..


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook