Varun Chakravarthy's bowling: వరుణ్ చక్రవర్తి బౌలింగ్ పాకిస్థాన్ గల్లీ క్రికెట్‌తో సమానం: సల్మాన్ భట్

Varun Chakravarthy's bowling in India vs Pakistan match :ఇండియా vs పాకిస్థాన్ మ్యాచ్‌లో వరుణ్ చక్రవర్తి పర్‌ఫార్మెన్స్‌పై పాకిస్థాన్ జట్టు మాజీ కేప్టేన్ సల్మాన్ భట్ స్పందిస్తూ.. '' వరుణ్ చక్రవర్తి తమకు సర్‌ప్రైజ్ బౌలర్ కానేకాడని అన్నాడు. ఆ మాటకొస్తే.. వరుణ్ చక్రవర్తి స్పిన్ మంత్రం పాకిస్థాన్‌పై ఎప్పటికీ పారబోదని సల్మాన్ భట్ స్పష్టంచేశాడు.

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 25, 2021, 06:21 PM IST
  • ఐపిఎల్ 2021 లో కోల్‌కతా వరంగా మారిన వరుణ్ చక్రవర్తి
    టీ20 వరల్డ్ కప్‌లో భారత్‌కి ప్లస్ పాయింట్ అవుతాడనే ఆశలు
    తొలి మ్యాచ్‌లో విఫలమైన వరుణ్ చక్రవర్తిపై సల్మాన్ భట్ కామెంట్స్
Varun Chakravarthy's bowling: వరుణ్ చక్రవర్తి బౌలింగ్ పాకిస్థాన్ గల్లీ క్రికెట్‌తో సమానం: సల్మాన్ భట్

Varun Chakravarthy's bowling in India vs Pakistan match : ఐపిఎల్ 2021లో కోల్‌కతా నైట్ రైడర్స్ బౌలింగ్ విభాగంలో కీలక ఆటగాడిగా పేరు తెచ్చుకున్న వరుణ్ చక్రవర్తి టీ20 వరల్డ్ కప్ టోర్నమెంట్‌లో ఆదిలోనే ఘోరంగా విఫలమయ్యాడు. నిన్న ఆదివారం పాకిస్థాన్‌తో జరిగిన టీ20 వరల్డ్ కప్ మ్యాచ్‌లో 33 పరుగులు ఇచ్చిన వరుణ్ చక్రవర్తి.. ఒక్క వికెట్ కూడా పడగొట్టలేకపోయాడు. ఐపిఎల్ 2021లో దూకుడు చూపించి, తన స్పిన్నింగ్‌తో ప్రత్యర్థులను బోల్తా కొట్టించిన వరుణ్ చక్రవర్తి.. టీ20 వరల్డ్ కప్‌కు ప్లస్ పాయింట్ అవుతాడనే అందరూ భావించారు. కానీ కీలకమైన ఇండియా vs పాకిస్థాన్ మ్యాచ్‌లోనే (India vs Pakistan match) వరుణ్ చక్రవర్తి ఎందుకు రాణించలేకపోయాడనే సందేహాలు వ్యక్తమయ్యాయి.

ఇండియా vs పాకిస్థాన్ మ్యాచ్‌లో వరుణ్ చక్రవర్తి పర్‌ఫార్మెన్స్‌పై పాకిస్థాన్ జట్టు మాజీ కేప్టేన్ సల్మాన్ భట్ స్పందిస్తూ.. '' వరుణ్ చక్రవర్తి తమకు సర్‌ప్రైజ్ బౌలర్ కానేకాడని అన్నాడు. ఆ మాటకొస్తే.. వరుణ్ చక్రవర్తి స్పిన్ మంత్రం పాకిస్థాన్‌పై ఎప్పటికీ పారబోదని సల్మాన్ భట్ స్పష్టంచేశాడు. 

Also read : India vs Pakistan: T20 World cup లో10 హాఫ్ సెంచరీలు కొట్టిన తొలి ఆటగాడు Virat Kohli

వరుణ్ చక్రవర్తి బౌలింగ్ స్టైల్ (Varun Chakravarthy's bowling) ఇక్కడ సర్వసాధారణమైన స్టైల్ అని పేర్కొన్న సల్మాన్ భట్.. పాకిస్థాన్‌లో గల్లీ క్రికెట్‌లోనే వరుణ్ చక్రవర్తి బౌలింగ్ స్టైల్ చాలా కామన్ అని తీసిపారేసే స్టేట్‌మెంట్ ఇచ్చాడు. అందుకే వరుణ్ చక్రవర్తి ఐపిఎల్ 2021 లో రాణించిన స్టైల్‌తోనే పాకిస్థాన్ ఆటగాళ్లను నియంత్రించ వచ్చు అనుకుంటే.. అది ఎప్పటికీ సాధ్యపడదని సల్మాన్ భట్ (Salman Butt) పేర్కొన్నాడు.

Also read : Babar Azam about Ind vs Pak match result: ఇండియాపై పాక్ విజయంపై బాబర్ ఆజం ఏమన్నాడంటే..

Also read : India Vs Pakistan: 'షమీ నువ్వు పాకిస్తాన్ వెళ్ళిపో అంటూ'.. బూతులు తిడుతున్న నెటిజన్లు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News